హైదరాబాద్ లో చిక్కిన మరో డ్రగ్స్ ముఠా.. ఆన్లైన్ లో అందమైన అమ్మాయిలతో..

హైదరాబాద్ లో చిక్కిన మరో డ్రగ్స్ ముఠా.. ఆన్లైన్ లో అందమైన అమ్మాయిలతో..

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మహానగరంలో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా మరో డ్రగ్స్ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అయితే ఈ ముఠా డ్రగ్స్ తో పాటు ఆన్లైన్లో వ్యభిచారం సైతం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

  • Share this:
    హైదరాబాద్ మహానగరంలో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా మరో డ్రగ్స్ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అయితే ఈ ముఠా డ్రగ్స్ తో పాటు ఆన్లైన్లో వ్యభిచారం సైతం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరాళ తదితర రాష్ట్రాల నుంచి అందమైన అమ్మయాలను తీసుకువచ్చి వారు వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. అందమైన యువతుల ద్వారా విటులు, ఇతరులకు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. పోలీసులు తమ దాడుల్లో నిందితుడి వద్ద 200 గ్రాముల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక నైజీరియన్ నుంచి అందిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్  ను ఇక్కడికి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు ఆ డ్రగ్స్ ను విక్రస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు