గుంటూరులో డ్రగ్స్ కలకలం... అపార్ట్‌మెంట్‌లో సీక్రేట్‌గా తయారు చేసి...

నల్లపాడు పోలీసులు పక్కా సమాచారంతో అపార్ట్‌మెంట్‌పై దాడులు చేశారు. నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని డ్రగ్ ముఠాను పట్టుకున్నారు.

news18-telugu
Updated: November 23, 2019, 1:05 PM IST
గుంటూరులో డ్రగ్స్ కలకలం... అపార్ట్‌మెంట్‌లో సీక్రేట్‌గా తయారు చేసి...
గుంటూరులో డ్రగ్స్ కలకలం
  • Share this:
సౌజీ దేవస్థుడు షాజీ అరెస్ట్


గత కొన్ని రోజులుగా ఏపీలో ఎక్కడిపడితే అక్కడ డ్రగ్స్ కలకలం నెలకొంటుంది. కొన్నిరోజుల క్రితం తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి కాస్త దూరంలో జోరుగా గంజాయి దందా నడుస్తుందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపుతోంది. నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఓ అపార్ట్‌మెంట్‌లో రహస్యంగా డ్రగ్స్ తయారు చేసి.. ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు పక్కా సమాచారంతో అపార్ట్‌మెంట్‌పై దాడులు చేశారు. నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 23, 2019, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading