బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌ను దాచిన యువతి...తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేసిందంటే..?

ఆటిస్ బెడ్రూమ్ లోనే కాస్టో నివసించడం మొదలు పెట్టాడు. అక్కడే ఆటిస్ తో కలిసి సహజీవనం కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా కాస్టో జాగ్రత్త పడేవాడు. ఉదయం పూట ఆటిస్ గదిలోనే ఉండేవాడు. అయితే కాస్త చీకటి పడ్డాక నెమ్మదిగా బయటపడి, తిరిగి అర్థరాత్రి ఆటిస్ గదిలోకి చేరేవాడు.

news18-telugu
Updated: June 18, 2019, 5:48 PM IST
బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌ను దాచిన యువతి...తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేసిందంటే..?
ప్రతీకాత్మక చిత్రం..
news18-telugu
Updated: June 18, 2019, 5:48 PM IST
కుమార్తె బెడ్రూమ్‌లో గుర్తు తెలియని వ్యక్తిని చూసి అవాక్కయ్యారు తల్లిదండ్రులు, వెంటనే పోలీసులను పిలిచి అతడిని అరెస్టు చేయించారు. అయితే ఆ వ్యక్తి తమ కుమార్తె గదిలో ఏం చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాడు అనే విషయాలపై పోలీసులు ఆరతీయగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన మాథ్యూ కాస్టో తన గర్ల్ ఫ్రెండ్ గదిలో గత కొద్ది వారాలుగా నివాసముంటున్నాడు. యువతి ఆహ్వానం మేరకే అతడు రోజు కిటికీ గుండా ఆమె గదిలోకి ప్రవేశిస్తున్నాడు. ముఖ్యంగా అర్థరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో తమ కుమార్తె గదిలోకి ప్రవేశిస్తున్నట్లు యువతి తల్లి దండ్రులు తమ ఫిర్యాదులో తెలిపారు. మాథ్యూ కాస్టో, యువతి ఇద్దరూ ఒక పబ్ లో కలుసుకున్నారు. అక్కడే పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే మాథ్యూ కాస్టో ఇల్లు వదిలేసి తిరుగుతున్న దేశదిమ్మరి, అతడిని తన ఇంట్లోనే ఉండమని యువతి ఆహ్వానించింది. కానీ తన తల్లిదండ్రులకు తెలియకుండా రోజు కిటికి గుండా వచ్చి తన బెడ్రూమ్ లో ఉండవచ్చని యువతి ఆహ్వానించింది. దీనికి కాస్టో సైతం ఓకే అన్నాడు.

అలా రోజు తన యువతి బెడ్రూమ్ లోనే కాస్టో నివసించడం మొదలు పెట్టాడు. అక్కడే యువతి తో కలిసి సహజీవనం కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా కాస్టో జాగ్రత్త పడేవాడు. ఉదయం పూట యువతి గదిలోనే ఉండేవాడు. అయితే కాస్త చీకటి పడ్డాక నెమ్మదిగా బయటపడి, తిరిగి అర్థరాత్రి యువతి గదిలోకి చేరేవాడు. అయితే కొద్ది రోజులుగా తమ కుమార్తె గదిలోంచి బయటకు రావడం లేదని, అలాగే వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో పాటు తమ కుమార్తె గదిలోంచి వింత శబ్దాలు రావడం కూడా గమనించిన యువతి తల్లిదండ్రులు, గదిలో ఏం జరుగుతోంది, అనే దానిపై ఆరా తీసారు. ఒక రోజు ఉదయం పూట కుమార్తె బెడ్రూం గది తలుపు తెరిచి మొత్తం చెక్ చేయగా, బాత్రూంలో నక్కి దాక్కున్న కాస్టో బయటపడ్డాడు. అయితే గదిలో కాస్టో నిషేధిత డ్రగ్స్ కూడా దాచినట్లు గుర్తించడంతో పోలీసులకు తెలిపారు. దీంతో నిందితుడు కాస్టోను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...