Drugs Case : సంజనా ఫ్లాట్స‌్‌కి వచ్చిన వీఐపీలు.. నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్న పోలీసులు!

డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు వీఐపీల పేర్లు వెలుగులోకి వస్తున్నట్టుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నటీమణులు రాగిణి, సంజనాలను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

news18-telugu
Updated: September 12, 2020, 11:13 AM IST
Drugs Case : సంజనా ఫ్లాట్స‌్‌కి వచ్చిన వీఐపీలు.. నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్న పోలీసులు!
రాగిణి ద్వివేది, సంజనా గల్రాణి (Ragini Dwivedi, Sanjana Galrani)
  • Share this:
డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు వీఐపీల పేర్లు వెలుగులోకి వస్తున్నట్టుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నటీమణులు రాగిణి, సంజనాలను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. శుక్రవారం బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ సంజన, రాగిణిలను విచారించారు. డ్రగ్స్ పార్టీలకు సంబంధించి వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకునే కొందరు రాజకీయ నాయకుల కుమారుల పేర్లను వారు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీంతో వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది.

మరోవైపు పోలీసులు విచారణలో నటి సంజన ఆసక్తిక విషయాలను వెల్లడించారు. బెంగళూరులో తనకు 10 ఫ్లాట్స్ ఉన్నట్టు అంగీకరించారు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్స్‌కు వచ్చి వెళ్లారనే ఆరా తీస్తున్నారు. సంజనా ఫ్లాట్స్‌కు వచ్చి వెళ్లినవారిలో పలువురు కన్నడ నటులు, సంగీత దర్శకులు ఉన్నట్టుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కుమారులు.. న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా ఈ కేసుకు సంబంధించి తమ పేరు బయటకు పొక్కకుండా ఉండేందకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక, డ్రగ్స్ కేసుకు సంబంధించి అరెస్ట్‌లు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా డ్రగ్స్ విక్రేతగా పేరుపొందిన మంగళూరుకు చెందిన ప్రతీక్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ప్రతీక్‌శెట్టికి డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిశాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.
Published by: Sumanth Kanukuka
First published: September 12, 2020, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading