కాలం మారుతుంది. సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా కష్టపడి మంచి స్థాయిలో ఉండాల్సిన యువత డ్రగ్స్ కు బానిసలా తయారవుతున్నారు. మత్తుకు అలవాటు పడి యువత జీవితాన్ని చిత్తూ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కళ్లు గప్పి గంజాయిని వాడుతున్నారు యువత. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు బాగానే ఉంటున్నారనే భ్రమలో ఉండిపోతున్నారు. వీరిని ఆసరాగా చేసుకుంటున్న అంతరాష్ట్ర ముఠాలు కాసుల కోసం గంజాయిని ఎక్కడికంటే అక్కడికి తరలిస్తూ జీవితాలను నాశనం చేస్తున్నారు.
మరోసారి అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపాయి. భాగ్యనగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నలుగురు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారీగా తెలుస్తుంది. వీరు రాజస్థాన్ నుండే డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్ (Hyderabad) వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. నిందితుల నుండి ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
మొన్నటి వరకు పట్టణాల్లో..నేడు పల్లెలకు కూడా..
కాగా ఈ డ్రగ్స్ దందా ఇన్ని రోజులు కేవలం పట్టణాలకే పరిమితమయ్యేది. ఆయా పట్టణాలకు సరఫరా చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగేది. ఇక ఇప్పుడు పల్లెల్లోనూ గంజాయి గుప్పుమంటుంది. చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడి జీవితాలను అంధకార మయం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా కొనసాగుతుంది. పోలీసుల కళ్లు గప్పి ఆయా ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు.
పుష్ప సినిమా సీన్ ను వాడేస్తున్న దందా..
ఇటీవల ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కించు మండలంలో అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఓ బొలెరో వాహనం కనిపించింది. అయితే అన్ని వాహనాలకు ఉన్నట్టే బొలెరో టాప్ పై లగేజ్ పెట్టుకునేందుకు వీలుగా స్టాండ్ ఉంది. ఇక వాహనంలోని వారిని ప్రశ్నించగా పోలీసులకు అనుమానం వచ్చింది. దీనితో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వాహనంపై పై ఉన్న ప్రత్యేక అరను పోలీసులు గుర్తించారు. వాహనం టాప్ లేపి చూస్తే ఆ అరలో ఉన్న గంజాయిని చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 కిలోల గంజాయిని ప్రత్యేక అర ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. ఇక ఈ ఘటన చూసిన SEB అధికారులకు ఆశ్చర్యపోవడం వంతైంది. ఈ ఘటనలో రమేష్, మహేశ్వర్ ను ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వాహనాన్ని పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Drugs, Drugs case, Telangana