Home /News /crime /

DRUG SMUGGLERS ATTACK NARCOTICS POLICE WITH STONES AND GUNS IN DELHI SNR

DELHI:నార్కోటిక్స్ పోలీసులపై రాళ్లు, తుపాకులతో దాడి..చేసిన వాళ్లెవరో తెలిస్తే షాక్..

DELHI

DELHI

DELHI: దేశ రాజధానిలో నేరస్తులు అధికారులపైనే ఎటాక్ చేస్తున్నారు. డ్రగ్ స్మగ్లర్‌ని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన నార్కోటిక్స్ అధికారులపై రాళ్లు, బుల్లెట్ల వర్షం కురిపించారు. హోరాపోరీగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు గాయపడితే..నలుగురు అధికారులు ఆసుపత్రి పాలయ్యారు.

ఇంకా చదవండి ...
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఓ డ్రగ్‌ స్మగ్లర్‌ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన నార్కోటిక్స్ (Narcotics)పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇంద్రపురి(Indrapuri)లో ఉంటున్న డ్రగ్ స్మగ్లర్ ధరమ్‌వీర్‌ (Dharam veer palla)పల్లాను నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్ (Non bailable arrest warrant)కింద అదుపులోకి తీసుకోవడానికి వెళ్లారు అధికారులు. ఆ సమయంలో డ్రగ్స్ డాన్‌(Drugs don)ఇంట్లో లేకపోవడంతో ఆచూకి వెదికేందుకు బయటకు వచ్చారు. ఇంతలో పోలీసులు తనను వెదుక్కుంటూ ఇంటికి వచ్చారని  తెలుసుకున్న ధరమ్‌వీర్‌ పల్లా నార్కోటిక్స్ (Narcotics)పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. 50మందికిపైగా తన అనుచరులతో కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేయించాడు. కరడుగట్టిన నేరస్తుడ్ని అరెస్ట్ చేసేందుకు వచ్చిన తమపై ఎదురుదాడి జరగడంతో అలర్టైన ఔటర్‌ నార్త్ డిస్ట్రిక్ట్ నార్కోటిక్స్ టీమ్ ఇన్స్‌పెక్టర్ బ్రిజ్‌పాల్‌ (Brijpal)ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న పిస్టోల్‌ని చేతిలో తీసుకొని గాల్లో కాల్పులు జరిపాడు. పోలీసులే తమను కాల్చి చంపుతారన్న ఆలోచనతో డ్రగ్‌ స్మగ్లర్ ధరమ్‌వీర్‌ పల్లా బ్యాచ్‌ కూడా పోలీసులపై ఎదురు కాల్పులు జరిపింది.  తమలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూసుకునేందుకు అల్లరి మూకలపై అంతే వేగంగా ఎదురుదాడి చేశారు నార్కోటిక్‌ అధికారులు.

ఢిల్లీలో రెచ్చిపోయిన డ్రగ్స్ స్మగ్లర్‌..
నార్కోటిక్స్  పోలీసులు, డ్రగ్స్‌ స్మగ్లర్‌కి చెందిన రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ దాడిలో స్మగ్లర్ ధరమ్‌వీర్‌ పల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తుపాకి బుల్లెట్లు తగిలి గాయపడ్డారు. వాళ్లను అమిత్‌, సోహైబ్‌లుగా గుర్తించారు అధికారులు.అందులో అమిత్‌ డ్రగ్ డాన్ ధరమ్‌వీర్‌ పల్లాకు బంధువని తేల్చారు. ఢిల్లీలోని రఘుబీర్‌నగర్‌లో ఉంటున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అమిత్‌పై గతంలో దోపిడీ, హత్యాయత్నం వంటి ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నార్కోటిక్స్ అధికారులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అమిత్, సోహైబ్‌ను రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

అధికారులపైనే ఎదురుదాడి ..
డ్రగ్స్ స్మగ్లర్లను ఎదుర్కొనే క్రమంలో ఢిల్లీ నార్కోటిక్స్ అధికారుల బృందంలో కొందరికి గాయాలయ్యాయి. అల్లరి మూకలు విసిరిన రాళ్లు తగిలి నలుగురు పోలీసు సిబ్బంది ఆసుపత్రి పాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇన్స్‌పెక్టర్‌ బ్రిజ్‌పాల్, ఏఎస్‌ఐ రాజేష్, రింకు, వినోద్‌ అనే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరందరిని ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన డ్రగ్స్ స్మగ్లర్ ధరమ్‌వీర్‌ పల్లా మాత్రం తప్పించుకున్నాడు. ఈ మొత్తం దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరడుగట్టిన డ్రగ్స్ నేరస్తులతో పాటు మిగిలిన వారిపై చర్యలకు రెడీ అవుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Delhi, Drug case, Smuggling

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు