Home /News /crime /

DRUG PARTY BUSTED IN NASHIK ACTRESSES A FORMER BIG BOSS CONTESTANT BUSINESSMEN DETAINED SU

డ్రగ్ పార్టీ‌.. Businessmenతో నటీమణులు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పోలీసులు వెళ్లేసరికి..

డ్రగ్ పార్టీ జరిగిన బంగ్లా

డ్రగ్ పార్టీ జరిగిన బంగ్లా

ఓ డ్రగ్ పార్టీపై దాడులు నిర్వహించిన పోలీసులు.. భారీగా కొకైన్, ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకన్నారు. ఈ పార్టీకి సంబంధించి మొత్తం 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  ఓ డ్రగ్ పార్టీపై దాడులు నిర్వహించిన పోలీసులు.. భారీగా కొకైన్, ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకన్నారు. ఈ పార్టీకి సంబంధించి మొత్తం 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాశిక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఇగాత్‌పురిలోని ఓ ప్రైవేట్ బంగ్లాలో జరుగుతున్న పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. ఈ ఘటనలో 10 మంది పురుషులు, 12 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  పార్టీలో పాల్గొన్న పురుషుల్లో ముంబైకి చెందిన వ్యాపారవేత్తలతో పాటుగా, ఒక బుకీ కూడా ఉన్నాడని నాశిక్ రూరల్ పోలీసులు తెలిపారు. ఇక, 12 మంది మహిళల్లో.. ఆరుగురు వెబ్ సిరీస్‌ల్లో పనిచేసిన మోడల్స్, నటీమణులు, ఇద్దరు కొరియోగ్రాఫర్లు, ఒకరు ఇరానియన్ మూలాలు ఉన్న మోడల్, ఒకరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకన్న 22 మందిని వైద్య పరీక్షలకు తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. పార్టీ పేరుతో వ్యభిచారం ఏమైనా నిర్వహించరా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.

  ఈ ఘటనకు సంబంధించి నాశిక్ ఎస్పీ సచిన్ పాటిల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మేము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే పనిలో ఉన్నాం. 22 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పార్టీలో వినియోగించిన డ్రగ్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకన్నాం. మాకు అందిన కొంత సమాచారం మేరకు మేము ఈ దాడి జరిపాం. ఈ 22 మంది ఇగాత్‌పూరికి వేర్వేరు మార్గాల్లో చేరుకున్నారు. అక్కడ వ్యభిచారం జరిగిందా అనే కోణంలో మేము విచారణ చేపడుతున్నాం’అని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Drugs, Maharashtra

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు