• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • DRUG ADDICT HUSBAND SANDED HIS OWN WIFE NECK WITH A SHARP WEAPON IN MEERUT SSR

Husband: టెర్రాస్‌పై మద్యం తాగుతూ భార్యాభర్తల సిట్టింగ్.. ఆమెకు వచ్చిన ఒక్క కాల్‌తో..

ప్రతీకాత్మక చిత్రం

మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న వికాస్ అలియాస్ విక్కీకి, ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన నేహాకు గతేడాది వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యపై వికాస్ అనుమానం పెంచుకున్నాడు. తాను అనుమానపడుతున్న విషయం భార్యకు తెలియకుండా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే.. నేహా కొన్ని నెలలుగా గంటల తరబడి ఫోన్ మాట్లాడటం, తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ రావడాన్ని వికాస్ గమనించాడు.

  • Share this:
    మీరట్: భార్యాభర్తలిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఇద్దరూ కాసేపు బాగానే మాట్లాడుకున్నారు. ఇంతలో భార్య ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. ఆ ఫోన్‌కాల్‌తో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటికే భార్యపై తీవ్ర అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. యూపీలోని మీరట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న వికాస్ అలియాస్ విక్కీకి, ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన నేహాకు గతేడాది వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యపై వికాస్ అనుమానం పెంచుకున్నాడు. తాను అనుమానపడుతున్న విషయం భార్యకు తెలియకుండా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే.. నేహా కొన్ని నెలలుగా గంటల తరబడి ఫోన్ మాట్లాడటం, తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ రావడాన్ని వికాస్ గమనించాడు. దీంతో.. ఈ పరిణామాల మూలంగా నేహాపై వికాస్ అనుమానం మరింత బలపడింది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందని భావించిన వికాస్ మద్యానికి అలవాటుపడ్డాడు. అప్పుడప్పుడు భార్య నేహాతో కలిసి కూడా తాగేవాడు. ఆమె కూడా భర్తతో కలిసి మద్యం సేవించేది. అంతలా ఎవరు కాల్స్ చేస్తున్నారని నేహాను కొన్ని సందర్భాల్లో వికాస్ నిలదీశాడు. అప్పటి నుంచి భర్తతో నేహా అంటీముట్టనట్టుగా ఉండేది. అయితే.. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండగా.. ఇటీవల వికాస్, నేహా కలిసి ఇంట్లో మద్యం సేవించారు.

    ఇద్దరూ కాసేపు సరదాగానే ఆ విషయం, ఈ విషయం మాట్లాడుకున్నారు. అయితే.. భార్యాభర్తలిద్దరూ టెర్రాస్‌పై మందు సిట్టింగ్‌లో ఉండగా నేహా ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. దీంతో.. అప్పటివరకూ అక్కడ ఉన్న హ్యాపీ మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేయకుండా కట్ చేసిన నేహా ఏదో రాంగ్ నంబర్ అని భర్తకు చెప్పింది. అయితే.. అప్పటికే భార్యకు వస్తున్న ఫోన్ కాల్స్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న వికాస్ నేహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అబద్ధాలు చెప్పొద్దని.. కాల్ చేసింది వాడే కదా అని భార్యను నిలదీశాడు.

    ఇది కూడా చదవండి: ఈ లాక్‌డౌన్‌లు అవీ నా వల్ల కావడం లేదు.. త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా అని..

    నేహా ఎవరూ కాదని.. రాంగ్ నంబర్ అని చెప్పింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరికీ మధ్య ఫోన్ కాల్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో నేహాపై వికాస్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. పై నుంచి పెద్దపెద్దగా కేకలు వినిపించడంతో అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన వికాస్ తల్లి పైకెళ్లి చూసేసరికి నేహా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో.. వికాస్‌ను వారించిన అతని తల్లి కోడలిని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం నేహా పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: