Home /News /crime /

DRIVER WHO WENT TO DRINK TEA AND THE TEACHER WHO TOOK THE CAR WITH INTEREST CRASHED INTO THE WALL AND DIED MISERABLY SSR

Tragedy: డ్రైవర్ టీ తాగి వచ్చేలోపు ఘోరం జరిగిపోయింది.. ఆమెకు ఆ ఆలోచన రాకపోయినా బాగుండేది..

టీచర్ అమరావతి (ఫైల్ ఫొటో)

టీచర్ అమరావతి (ఫైల్ ఫొటో)

ఆమె ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్. భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత జీవనం సాగిస్తున్న ఈ భార్యాభర్తలు ఇటీవల కారు కొనుక్కున్నారు. ఆమె స్కూల్‌కు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో రోజూ ఆమెను కారులో తీసుకెళ్లి, తీసుకురావడానికి ఆమె భర్త ఓ డ్రైవర్‌ను మాట్లాడాడు.

ఇంకా చదవండి ...
    ధర్మపురి: ఆమె ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్. భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత జీవనం సాగిస్తున్న ఈ భార్యాభర్తలు ఇటీవల కారు కొనుక్కున్నారు. ఆమె స్కూల్‌కు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో రోజూ ఆమెను కారులో తీసుకెళ్లి, తీసుకురావడానికి ఆమె భర్త ఓ డ్రైవర్‌ను మాట్లాడాడు. కొన్ని నెలలుగా ఆమె కారులో స్కూల్‌కు వెళ్లి, స్కూల్ నుంచి ఇంటికి వస్తోంది. కానీ.. ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆమె జీవితాన్నే చిదిమేసింది.

    ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ధర్మపురి వెన్నంపల్లి ప్రాంతానికి చెందిన అమరావతి(44) అనే మహిళ.. కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల‌్‌‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త శక్తివేల్ కూడా కుంభకోణంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత విధుల్లో ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొన్ని నెలల క్రితం అమరావతి కొత్త కారు కొన్నారు. అయితే.. ఆమెకు డ్రైవింగ్ రాదు. పోచంపల్లిలోని స్కూల్‌కు రోజూ వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో సొంత కారు ఉంటే శ్రేయస్కరమని భావించి ఆమె కారు కొన్నారు.

    ఆమెను రోజూ స్కూల్‌లో దించి, మళ్లీ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేందుకు ఓ డ్రైవర్‌ను మాట్లాడుకున్నారు. కొన్ని నెలలుగా అమరావతి అలానే స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. అంతా బానే ఉంది. కానీ.. ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం జీవితాన్ని తలకిందులు చేసింది. రోజూలానే 19వ తేదీ సాయంత్రం కూడా ఆమె స్కూల్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చారు. ఆ సమయంలో డ్రైవర్ టీ తాగేందుకు దగ్గర్లోనే టీ కొట్టు దగ్గరకు వెళ్లాడు. ఆమె అతనిని గమనించి ఈలోపు కారులో కూర్చున్నారు. ఆ సమయంలో ఆమెకు ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో కానీ డ్రైవర్ వచ్చేలోపు ఒక్కసారి కారు నడుపుదామని అమరావతి భావించారు. కారు కీస్ కూడా ఉండటంతో ఆమె కారు స్టార్ట్ చేశారు. కారు ముందుకెళ్లింది. ఆ క్రమంలోనే కారు స్పీడ్‌గా దూసుకెళ్లింది. అంతే.. కారు అమాంతం వెళ్లి స్కూల్ గోడను ఢీ కొట్టింది.

    ఇది కూడా చదవండి: Beer Psycho: బెడ్రూం నిండా ఖాళీ బీర్ బాటిల్స్.. పడుకునే బెడ్‌పై తప్ప.. ఈ ‘బీర్ సైకో’ ఏం చేశాడంటే...

    ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కారు ప్రమాదం జరిగిన శబ్దం విన్న ఆమె తోటి టీచర్లు కారులో అమరావతి గాయాలతో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో ఆమెను ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఈలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పోచంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో కలిసిమెలిసి ఉండే టీచర్ ఇలా చనిపోతుందని కలలో కూడా ఊహించలేదని తోటి టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలిసి అమరావతి కూతుర్లు ఇద్దరూ హాస్పిటల్‌కు చేరుకున్నారు. తల్లి మృతదేహంపై పడి భోరున విలపించారు. ‘అమ్మా.. లేమ్మా’ అంటూ ఆమె కూతుర్లు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోచంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Car accident, Crime news, Tamilnadu, Tea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు