గర్ల్‌ఫ్రెండ్‌పై రేప్... ఇంటర్నెట్‌లో వీడియో అప్‌లోడ్...

Mumbai Crime : హోటల్ రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన అతడు... అత్యాచారాన్ని వీడియో రికార్డ్ చేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 10:58 AM IST
గర్ల్‌ఫ్రెండ్‌పై రేప్... ఇంటర్నెట్‌లో వీడియో అప్‌లోడ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబై... DN నగర్ పోలీసులు... 40 ఏళ్ల అశోక్ కుషాలేను అరెస్టు చేశారు. అతను ఓ బాలీవుడ్ నటుడి భార్యకు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా అశోక్ 35 ఏళ్ల ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వారం కిందట అతడు ఆమెను అంధేరీలోని ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించింది. క్రూరమృగంలా విరుచుకుపడి... అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె షాకైంది. ఇన్నాళ్లూ బాగానే ఉండేవాడివి... సడెన్‌గా ఇలా ఎందుకు చేశావని నిలదీసింది. ఆమెకు సమాధానం చెప్పకుండా... అక్కడి నుంచీ మెల్లిగా జారుకున్నాడు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు... ఆల్రెడీ అతనితోనే వివాహేతర సంబంధం ఉండటం వల్ల... అంతా తన ఖర్మ అనుకుంది. హోటల్ నుంచీ మౌనంగా ఇంటికి వెళ్లిపోయింది.

నాల్రోజుల తర్వాత... ఆమెకు దగ్గరి స్నేహితురాలు ఒకామె... కాల్ చేసింది. నీకు సంబంధించిన ఓ వీడియోని వాట్సాప్‌లో చూశాను అంది. ఏం వీడియో అని అడిగితే... ఆ వీడియోను బాధితురాలికి పంపింది. అది చూసిన బాధితురాలు షాకైంది. అది ఏదో కాదు... హోటల్ రూంలో జరిగిన రేప్‌కి సంబంధించిన వీడియో. షాక్‌లోకి వెళ్లిపోయిన ఆమె... వెంటనే తేరుకొని... అశోక్‌కి కాల్ చేసింది. ఆ వీడియో ఎలా వచ్చిందని అడిగింది. తాను ముందుగానే హోటల్ రూంలో సీక్రెట్ కెమెరా ఆన్ చేసి పెట్టాననీ, రేప్ మొత్తం రికార్డైందని చెప్పాడు. థ్రిల్ కోసం అలా చేశానన్నాడు.

ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలనుకున్న బాధితురాలు... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు... వీడియోని బ్లాక్ చేశారు. అశోక్ కోసం అతను పనిచేస్తున్న చోటికి వెళ్లగా... అతను రెండ్రోజులుగా అక్కడకు రావట్లేదని తెలిసింది. అశోక్‌కి తెలిసిన మరో కారు డ్రైవర్ ద్వారా... అతనికి కాల్ చేయించారు. జుహుకి రమ్మన్నాడు ఆ కారు డ్రైవర్. అతన్ని కలిసేందుకు అశోక్... జుహుకి వెళ్లాడు. అక్కడ ముందే కాపుకాసిన పోలీసులు... అశోక్‌ని పట్టుకున్నారు. తానే వీడియో అప్‌లోడ్ చేశానని తెలిపాడు. కుషాలేపై రేప్, పరువునష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు అతన్ని రెండ్రోజులు పోలీస్ కస్టడీకి పంపింది.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు