అర్థరాత్రి లేడీస్ హాస్టల్‌లో దూరి తాగుబోతుల హంగామా...ఏం జరిగిందంటే...

హాస్టల్ నిర్వాహకుని సోదరుడు అలాగే మరో ముగ్గురు మద్యం తాగి, హాస్టల్‌లో ఉంటున్న యువతులపై వేధింపులకు దిగారు.

news18-telugu
Updated: October 22, 2019, 10:34 PM IST
అర్థరాత్రి లేడీస్ హాస్టల్‌లో దూరి తాగుబోతుల హంగామా...ఏం జరిగిందంటే...
నమూనా చిత్రం
news18-telugu
Updated: October 22, 2019, 10:34 PM IST
బీహార్ రాజధాని పట్నాలోని ఒక గర్ల్స్ హాస్టల్‌లో దూరి తాగుబోతులు హంగామా సృష్టించారు. హాస్టల్ నిర్వాహకుడి బర్త్ డే సందర్భంగా మందు పార్టీ ఇచ్చినట్లు తెలిసింది. హాస్టల్ నిర్వాహకుని సోదరుడు అలాగే మరో ముగ్గురు మద్యం తాగి, హాస్టల్‌లో ఉంటున్న యువతులపై వేధింపులకు దిగారు. ఇదంతా వీడియో తీసిన యువతులు, సోషల్ మీడియాలో పోలీసు డిపార్ట్ మెంటుకు షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే హాస్టల్ కు చేరుకున్నారు. హాస్టల్‌లోని యువతులను విచారించారు. హాస్టల్ నిర్వాహకుడు సహాయ్, అతని సోదరుడు అభి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి రావడంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...