Home /News /crime /

DRI SEIZES 504 SMUGGLED GOLD BARS WORTH RS 42 CRORE FROM NEW DELHI RAILWAY STATION 8 ARRESTED

Gold Smuggling ముఠా గుట్టురట్టు..రూ.42 కోట్ల విలువ చేసే 84 కేజీల బంగారం సీజ్

అక్రమంగా తరలిస్తుండగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన బంగారం

అక్రమంగా తరలిస్తుండగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన బంగారం

గోల్డ్ స్మగ్లింగ్ ముఠాకు చెందిన ఎనిమిది మందిని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసిన డీఆర్ఐ అధికారులు..వారి దగ్గరి నుంచి 83.621 కేజీలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.42 కోట్లగా ఉండొచ్చని అంచనావేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్(డీఆర్ఐ) అధికారులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన 8 మందిని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి మయన్మార్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 504 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.42 కోట్లుగా డీఆర్ఐ అధికారులు అంచనావేస్తున్నారు. ఇంటెలిజన్స్ నుంచి వచ్చిన సమాచారంతో పక్కా ప్రణాళికతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఎనిమిది మంది ప్రయాణీకులు...తమ వస్త్రాల్లో దాచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

    వారి దగ్గరి నుంచి అక్రమంగా తరలిస్తున్న 504 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 99.9 స్వచ్ఛత కలిగిన దీని మొత్తం బరువు 83.621 కేజీలు కాగా...దీని విలువ దాదాపు రూ.42 కోట్లుగా అంచనావేస్తున్నారు. వీరు నకిలీ ఆధార్ కార్డులతో రైళ్లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    మయన్మార్ నుంచి అంతర్జాతీయ సరిహద్దును దాటి మణిపూర్ మీదుగా బంగారాన్ని అక్రంగా దేశంలోకి తీసుకొస్తున్నారు. గౌహాతి కేంద్రంగా పనిచేస్తున్న స్మగ్లర్లు...అక్కడి నుంచి ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబైకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. అక్కడ జ్యువలరీ దుకాణాల్లో ఈ బంగారు బిస్కెట్లతో ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. చాలా మాసాలుగా వారు ఇలా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Gold smuggling

    తదుపరి వార్తలు