హైదరాబాద్‌లో వెయ్యి కిలోలకు పైగా గంజాయి స్వాధీనం.. విశాఖ నుంచి..

విశాఖలో ఎవరు ఈ సరుకును అందజేశారు? మహారాష్ట్రలో ఎక్కడికి తరలిస్తున్నారు? అసలు దీని వెనక ఎవరున్నారు? అనే దానిపై కూపీ లాగుతున్నారు అధికారులు.

news18-telugu
Updated: August 15, 2020, 5:50 PM IST
హైదరాబాద్‌లో వెయ్యి కిలోలకు పైగా గంజాయి స్వాధీనం.. విశాఖ నుంచి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో భారీ గంజాయి ముఠా గుట్టురట్టయింది. నగర శివారులో భారీ మొత్తంలో గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కంటైనర్ నుంచి 1,050 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఆ గంజాయి విలువ రూ.2.62 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు కంటైనర్‌లో తరలిస్తుండగా, పక్కా సమాచారంతో హైదరాబాద్ శివారులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కంటైనర్‌లో ఇతరు సరుకుల మాటున ప్లాస్టిక్ సంచుల్లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. NDPS చట్టం కింద కంటైనర్‌ను సీజ్ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే విశాఖలో ఎవరు ఈ సరుకును అందజేశారు? మహారాష్ట్రలో ఎక్కడికి తరలిస్తున్నారు? అసలు దీని వెనక ఎవరున్నారు? అనే దానిపై కూపీ లాగుతున్నారు అధికారులు
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 5:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading