శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2.2 కేజీల బంగారం... ఇదీ చెన్నై నుంచీ వేసిన ప్లాన్...

స్మగ్లర్లు రోజురోజుకూ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచీ బంగారం తెస్తే పట్టుకుంటున్నారని తెలివిగా కొత్త ఎత్తుగడ వేశారు.

news18-telugu
Updated: January 4, 2020, 10:15 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2.2 కేజీల బంగారం... ఇదీ చెన్నై నుంచీ వేసిన ప్లాన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్... రోజూలాగే బిజీగా ఉంది. ప్రయాణికులు వస్తున్నారు, వెళ్తున్నారు. చెకింగ్స్, సెక్యూరిటీ ఎప్పట్లాగే పక్కాగా ఉంది. ఇంతలో నలుగురు DRI అధికారులు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి టైమ్ ఎంతైందా అని చూసుకున్నారు. చెన్నై నుంచీ రావాల్సిన ఫ్లైట్ ఇంకా రాలేదని తెలిసి... దాని కోసం వెయిట్ చెయ్యసాగారు. కాసేపటికి ఫ్లైట్ వచ్చింది. ప్రయాణికులు దిగారు. ఒకరి తర్వాత ఒకరుగా... వస్తుండగా... ఓ ప్రయాణికుడిపై DRI అధికారుల దృష్టి పడింది. అతను దిక్కులు చూసుకుంటూ... ఏవైవో సైగలు చేసుకుంటూ... మెల్లగా తన బ్యాగుతో ఎయిర్‌పోర్ట్ లోంచీ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని బ్యాగును స్కానర్ల ద్వారా చూశారు సెక్యూరిటీ అధికారులు. అందులో బంగారం ఉన్నట్లు తెలిసినా... అతన్ని పట్టుకోకుండా... ఏమీ లేనట్లుగా, ఏమీ తెలియనట్లుగా బ్యాగ్ ఇచ్చేశారు. అధికారులు కనిపెట్టలేకపోయారు అనుకుంటూ... అతను బ్యాగ్ తీసుకొని... ఎయిర్‌పోర్ట్ బయటకు వెళ్లాడు. అక్కడ మరో వ్యక్తిని కలిసి... తన బ్యాగ్ అతనికి ఇస్తుంటే... అప్పుడే DRI అధికారులు ఎంటరయ్యారు. ఓ నవ్వు నవ్వి... "రేయ్... నిన్న పట్టుకోవాలంటే... ఎయిర్‌పోర్ట్ లోనే పట్టుకునేవాళ్లం... నీ వెనక ఎవడున్నాడో తెలుసుకునేందుకే వెయిట్ చేశాం" అంటూ అతన్ని అరెస్టు చేశారు. అతని నుంచీ... 2.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.89.18 లక్షలుగా అంచనా వేశారు. ఆ బంగారం ఎవరిది? ఎక్కడి నుంచీ వచ్చిందీ తెలుసుకుంటున్నారు.

స్వాధీనం చేసుకున్న బంగారం
Published by: Krishna Kumar N
First published: January 4, 2020, 10:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading