పోలీసులకు ఫుల్లుగా మందు పోయించి ఖైదీ పరార్... ఖాకీలను మస్కా కొట్టించిన గ్యాంగ్‌స్టర్ బద్దూ...

కాపలాగా ఉన్న ఖాకీలు పీకల దాకా మందేసి, మత్తుగా పడిపోయిన తర్వాత అక్కడి నుంచి పరారైన గ్యాంగ్‌స్టర్... అతని మీద 4 హత్యలతో పాటు 34 కేసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 6:33 PM IST
పోలీసులకు ఫుల్లుగా మందు పోయించి ఖైదీ పరార్... ఖాకీలను మస్కా కొట్టించిన గ్యాంగ్‌స్టర్ బద్దూ...
పోలీసులకు ఫుల్లుగా మందు పోయించి, గ్యాంగ్ స్టర్ పరార్...
  • Share this:
బద్దన్ సింగ్ బద్దూ... ఇక్కడ మనకెవ్వరికీ పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఇతను. హత్యలు, బ్యాంకు రాబరీలు, హవాలా, దోపిడీ... ఇలాంటి 34 కేసులు తనపైన ఉన్నాయి. ఎలాగోలా గత ఏడాది పోలీసులకు చిక్కిన ఇతను... నెలరోజులుగా మీరట్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ హత్య కేసులో భాగంగా అతనికి జీవిత ఖైదు కూడా పడింది. మిగిలిన కేసుల గురించి విచారణ జరుగుతోంది. అలాంటి గ్యాంగ్ స్టర్‌కు కాపలాగా ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి. కానీ అతనితో ఉన్నవారు మాత్రం మందు చూడగానే అవన్నీ పక్కనే పెట్టేశారు. ఫ్రీగా వచ్చింది కదా అని ఫుల్లుగా మందేశాడు. పోలీసులకు ఫుల్లుగా మద్యం పోయించిన ఆ గ్యాంగ్‌స్టర్... అక్కడి నుంచి పరారయ్యాడు. కనీస బాధ్యత మరిచి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.

50 ఏళ్ల బద్దన్ సింగ్ బద్దూ... గజియాబాద్ కోర్టులో హజరుకావాల్సి ఉంది. సమాయానికి తీసుకెళ్లేందుకు బయలుదేరిన పోలీసులు... మార్గమధ్యలో ఓ హోటల్ దగ్గర తన అనుచరులు పార్టీ ఇస్తున్నారని చెప్పి వ్యాన్‌ను ఆపారు. కస్టడీలో ఉన్నది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనే విషయం కూడా మరిచి, పోలీసులంతా కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. కాపలాగా ఉన్న ఖాకీలు పీకల దాకా మందేసి, మత్తుగా పడిపోయిన తర్వాత బద్దన్ సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. 1996లో ఓ లాయర్‌ను హత్య చేసిన కేసులో నేరం రుజువైన బద్దూకి జీవిత ఖైదీ విధించింది కోర్టు. దీంతో పాటు నాలుగు హత్య కేసులు, దోపిడీలు, హత్యాయత్నాలు... ఇలా 3 కేసుల్లో బద్దూ నిందితుడు. 40 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి మీరట్ వచ్చిన బద్దూ... మొదట్లో ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ మొదలెట్టాడు. తర్వాత సుశీల్ మూచ్, బూపిందర్ బహర్ అనే స్నేహితులతో కలిసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మొదలెట్టి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. పోలీసులకు పార్టీ ఇచ్చిన ముకుత్ మహాల్ హోటెల్‌లో కూడా అతనికి వాటా ఉంది. 2011లో జిల్లాపరిషత్ మెంబర్ సంజయ్ గుజ్జర్ హత్య, 2012లో డెన్ కేబుల్ నెట్‌వర్క్ మేనేజర్ పవిత్ర మిత్రే హత్యలు చేసింది కూడా బద్దూనే.

నేరసామ్రజ్యంలో కోట్ల ఆస్తులు కూడబెట్టిన బద్దూ భార్య, కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. భార్య అక్కడ ఓ హోటల్ వ్యాపారం నడుపుతుండగా, కొడుకు పీజీ చదువుతున్నాడు. బద్దూ తప్పించుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు... ఇందుకు కారణమైన ఆరుగురు పోలీసులను అరెస్ట్ చేసింది. వారికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బద్దూ దేశం విడిచి పారిపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు అధికారులు.
First published: March 29, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading