Dowry murder case : బీహార్(Bihar) లో దారుణం జరిగింది. బంగారు గొలుసు, 50 వేల రూపాయల కోసం నవ వధువును హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వైశాలి జిల్లా మహానార్లో చోటుచేసుకుంది. మృతి చెందిన నవ వధువును ప్రీతీదేవిగా గుర్తించారు. గురువారం ఉదయం, వైశాలి జిల్లాలోని మహానార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంగా నది సతిహార ఘాట్ దగ్గర ఒక మహిళ మృతదేహం పడి ఉంది. ఉదయం పశువులను మేపేందుకు గంగా నది ఒడ్డుకు వెళ్లిన వారికి మహిళ మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. నది దగ్గర మృతదేహం లభ్యమైందన్న వార్తతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు మహనార్ పోలీస్స్టేషన్ పోలీసులు, సహదేయ్ ఓపీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. నదిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాజీపూర్ సదర్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని చక్ఫైజ్ పంచాయతీ నివాసి రాహుల్ కుమార్ భార్య ప్రీతీ దేవిగా గుర్తించారు. తమ కుమార్తెది వరకట్న హత్యేనని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తిసియోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారీ ఖుర్ద్ గ్రామానికి చెందిన మోహన్ పాశ్వాన్ తన కుమార్తె ప్రీతిని 13 మే 2022న చక్ఫైజ్ పంచాయతీకి చెందిన అదాలత్ పాశ్వాన్ కుమారుడు రాహుల్ కుమార్ కి ఇచ్చి వివాహం జరిపించారు. బంగారు గొలుసు, 50 వేల నగదు కోసం ప్రీతీని వివాహమైనప్పటి నుంచి నిత్యం భర్త చిత్రహింసలు పెడుతున్నాడని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ కుమార్తెను హత్య చేసి నదిలో పడేశాడని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా,దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Shocking :షాకింగ్..నదిలో కొట్టుకుపోయిన కారు,9మంది టూరిస్టులు మృతి
మరోవైపు,బీహార్(Bihar)రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం కేసులో అరెస్ట్ అయిన భర్తను రక్షించేందుకు ఓ చేతిలో బియ్యం, మరో చేతిలో ప్రత్యేక రకం కర్రతో పోలీస్ స్టేషన్(Police Station)కు చేరుకున్న మహిళ తనను తాను దుర్గా మాత అని పేర్కొంటూ మాట్లాడటం ప్రారంభించింది. దీంతో పోలీస్ స్టేషన్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచమహువా ముసహరిలో కార్తీక్ మాంఝీ అనే వ్యక్తిని పోలీసులు మద్యం కేసులో అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. అయితే కార్తీక్ భార్య సంజు దేవీ..ఓ చేతిలో బియ్యం, మరో చేతిలో ప్రత్యేక రకం కర్రతో పోలీస్ స్టేషన్కు చేరుకుని దుర్గామాతగా నటిస్తూ జిమ్మిక్కులు చేయడం ప్రారంభించింది. హఠాత్తుగా వచ్చిన మహిళ పోలీస్ స్టేషన్ ఆవరణలో, పోలీసు అధికారులపై అన్నం చల్లుతూ డ్రామా చేయడం ప్రారంభించింది. తన భర్తను వెంటనే వదిలేయాలని,లేకపోతే అందరూ బాధపడతారు అని సంజూ దేవి పోలీసులను హెచ్చరించింది. అనంతరం స్టేషన్ ఇన్చార్జి జితేంద్ర దేవ్ దీపక్ సంజూదేవితోపాటు ఆమెతో పాటు వచ్చిన మహిళలను పోలీస్స్టేషన్ ఆవరణ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే పోలీసులు సంజూ దేవిని కస్టడీలోకి తీసుకోవడం గురించి మాట్లాడటంతో.. వారు వెంటనే డ్రామాను విరమించుకున్నారు. అనంతరం పోలీసులు వివరణ ఇవ్వడంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. సంజూ దేవి తన గ్రామంలో కూడా దుర్గామాత తనలోకి వచ్చినట్లు నటిస్తూనే ఉంటుందని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Dowry demand, Dowry harassment, Husband kill wife