హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad: చేతులెలా వచ్చాయో.. బ్యూటీపార్లర్ నడుపుతున్న ఈమె జీవితం ఇలా ముగిసిపోవడం దారుణం..

Sad: చేతులెలా వచ్చాయో.. బ్యూటీపార్లర్ నడుపుతున్న ఈమె జీవితం ఇలా ముగిసిపోవడం దారుణం..

పింకి (ఫైల్ ఫొటో)

పింకి (ఫైల్ ఫొటో)

హర్యానాలోని ఘోరం జరిగింది. అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అత్తింటి వాళ్లు ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రికి చెందిన నిహాల్ సింగ్ కూతురు పింకి.

ఇంకా చదవండి ...

హిసార్: హర్యానాలోని ఘోరం జరిగింది. అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అత్తింటి వాళ్లు ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రికి చెందిన నిహాల్ సింగ్ కూతురు పింకి. ఆమె తండ్రి వ్యవసాయం చేస్తుండేవాడు. పింకికి హర్యానాలోని సిసార్ గ్రామానికి చెందిన ధర్మజీత్ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురి పేరు ఇషికా, రెండో కూతురు ఎనిమిదేళ్ల పాప, ఐదేళ్ల మయాంక్ అనే బాబు ఉన్నాడు. పింకికి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లే జీవితం బాగుంది. పెళ్లయిన కొన్ని నెలల నుంచే ఆమెకు అత్తింట్లో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఆమెను భర్త, అత్త తిట్టికొట్టి హింసించేవారు. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని పింకిని చిత్రహింసలకు గురిచేసేవారు.

కూతురి కాపురం బాగుండాలని పింకి తల్లిదండ్రులు ఇప్పటికి పెళ్లయిన నాటి నుంచి మూడుసార్లు అల్లుడికి డబ్బులు ఇచ్చారు. అయినప్పటికీ పింకికి వేధింపులు తప్పలేదు. కొన్ని రోజుల నుంచి ఆమెకు మళ్లీ అదనపు కట్నం వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త ఖాళీగా ఉంటున్నప్పటికీ పింకి బ్యూటీపార్లర్ నడుపుతూ కొంత డబ్బు సంపాదిస్తుంటే.. ఆ డబ్బును కూడా భర్త లాక్కునేవాడు. పింకి భర్త, అత్త వేధింపులు ఇటీవల మరింత పెరిగాయి. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని పింకి భర్త, అత్త, మరదలు, అత్త తమ్మడు వేధించసాగారు. ఇప్పటికే తన కుటుంబం చాలాసార్లు ఇచ్చారని.. వ్యవసాయం చేసే వాళ్ల దగ్గర మళ్లీమళ్లీ డబ్బులంటే ఎక్కడ నుంచి వస్తాయని పింకి భర్తను నిలదీసింది.

ఇది కూడా చదవండి: Shocking Incident: అయ్యో పాపం.. ఈ అమ్మాయి.. కాలేజీ నుంచి అన్నయ్య బైక్‌పై తిరిగొస్తుంటే ఇతనొచ్చి...

పింకి కాస్త గట్టిగా మాట్లాడటంతో ఆమెపై పగ పెంచుకున్న భర్త.. శుక్రవారం ఉదయం పింకి గదిలో ఉండగా డీజిల్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు. పింకి ఇంటికి దగ్గర్లోనే ఉండే ఆమె తమ్ముడు సోనూకు అక్క అరుపులు వినిపించాయి. వెంటనే వెళ్లి చూడగా.. ఆమె మంటల్లో కాలిపోతూ కనిపించింది. మంటలను ఆర్పి.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తన అక్కను పింకి తమ్ముడు మేహంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో పింకి భర్త ధర్మజీత్‌ను, అతని తల్లిని, అక్కను, మేనమామను పోలీసులు అరెస్ట్ చేశారు. పింకి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

First published:

Tags: Crime news, Dowry, Dowry harassment, Murder, Wife murdered

ఉత్తమ కథలు