హైదరాబాద్ పాతబస్తీలో తల్లీ కూతురి హత్య... చంపిందెవరు?

Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో తల్లి, కూతురు దారుణ హత్యకు గురైయ్యారు. కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 2:55 PM IST
హైదరాబాద్ పాతబస్తీలో తల్లీ కూతురి హత్య... చంపిందెవరు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hyderabad Double Murder : హైదరాబాద్... పాత బస్తీలో ఏం జరిగినా.... అది మొత్తం తెలంగాణలో చర్చకు దారితీయడం సహజం. తాజాగా... తల్లీ కూతురి హత్యపైనా ప్రజలు తలోరకంగా మాట్లాడుకుంటున్నారు. పాతబస్తీలోని ఘాజీమిల్లత్... నల్లవాగులోని ఓ ఇంట్లో జరిగిందీ దారుణం. ఇంకా తెల్లవారకముందే... 60 ఏళ్ల సాజితాబేగం, ఆమె కూతురు 32 ఏళ్ల ఫరీదా బేగంను ఎవరో చంపేశారు. తెల్లారి చుట్టుపక్కల వారు ఇంట్లోకి చూసినప్పుడు... రక్తపు మడుగులో శవాలు కనిపించడంతో కలకలం రేగింది. వెంటనే పోలీసులకు కాల్ వెళ్లింది. పోలీసులు వచ్చి స్థానికుల్ని కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ ప్రాథమిక దర్యాప్తులో తేలిందేంటంటే... సాజితా బేగం దగ్గరి బంధువైన రెహమానే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే... అతనే చేశాడా అన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. పోలీసులు మాత్రం రూల్ ప్రకారం క్లూస్ టీమ్‌ని పిలిపించి... వేలిముద్రలు, వెంట్రుకల సేకరణ చేయించారు. దుబాయ్‌లో ఉన్న ఫరీదాబేగం భర్త ఇండియా వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

క్లూస్ టీమ్ ఇచ్చే రిపోర్టు, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా... పోలీసులు ముందుకి వెళ్లనున్నారు. ఇప్పుడు వాళ్లకు కావాల్సింది ఎక్కడున్నాడో కూడా తెలియని రెహమానే. అతనే హత్య చేసి ఉంటే... ఎందుకు చేశాడో అతన్ని అదుపులోకి తీసుకొని అడగడం ద్వారా తెలుస్తుంది. ఒకవేళ అతను చెయ్యకపోయి ఉంటే... మరెవరు చేసి ఉంటారో ఎంక్వైరీ చెయ్యాల్సి ఉంటుంది. పాత నేరస్థులు ఈ పని చేసి ఉంటే... పోలీసుల దగ్గర ఆల్రెడీ పాత నేరస్థుల వివరాలు, వేలి ముద్రల వంటివి ఉంటాయి కాబట్టి... తాజా కేసులో బయటపడిన వేలిముద్రల్ని, పాత వాటితో పోల్చి నేరస్థుల్ని కనిపెట్టవచ్చు. అదే కొత్త వారెవరైనా ఈ హత్య చేసి ఉంటే... ఫోన్ కాల్ డేటా ఆధారంగా కొంతవరకూ కనిపెట్టే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా ఆర్థిక లావాదేవీల్లో తేడా వచ్చి ఈ హత్యలు జరిపి ఉంటారనే వాదన స్థానికుల నుంచీ వినిపిస్తోంది. పోలీసులు అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: February 14, 2020, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading