Home /News /crime /

DONT FALL ON ONLINE FRAUDS EXPERTS GIVES SUGGESTION TO AVOID THIS PROBLEMS FULL DETAILS HERE MS

Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సామాజిక మాధ్యమాల్లో మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ఆన్లైన్ మోసాలకు లక్ష్యంగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇది ఉన్నత స్థాయి మోసంగా మారింది. పోలీసులు, ప్రజా ప్రతినిధులనే తేడాలు లేకుండా ఎంతోమంది సైబర్ కేటుగాళ్లకు బలైపోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలూ ఎక్కువవుతున్నాయి. ఒకప్పడు దీనికి అమాయక, నిరక్షరాస్య ప్రజలు మాత్రమే బలయ్యేవారు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన వారు కూడా బురిడీ గాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. తాజాగా గుజరాత్ లోని జమాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ యూసుఫ్భాయ్ ఖేదవాలాను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఫేస్బుక్ లో ఆయన్ను కొంతమంది మోసగించిన ఘటనకు సంబంధించి సైబర్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇమ్రాన్ పేరుతో ఉన్న నఖిలీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆయన స్నేహితులు అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. ఆ అకౌంట్లో పెట్టిన పోస్టులో “ప్రస్తుతం నేను గాంధీనగర్లో ఉన్నాను. నాకు అత్యవసరంగా రూ.30,000 కావాలి. మీరు Google Pay లేదా Paytm ద్వారా డబ్బు పంపవచ్చు” అని సైబర్ నేరగాళ్లు పోస్ట్ పెట్టారు. ఎమ్మెల్యే స్నేహితుల్లో కొంతమందికి అనుమానం వచ్చి, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయట పడింది. ఆయన ఫొటోలు, వీడియోలను సేకరించి ఎమ్మెల్యే స్నేహితుల్లో కొందరు మోసగాళ్లు ఇలా ఫేస్బుక్లో డబ్బులు అడుగుతున్నారని నిర్ధారించుకున్నారు ఇమ్రాన్. అనంతరం ఈ మోసం గురించి ఆయన సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశారు.

పోలీసు ఉన్నతాధికారులనూ వదల్లేదు..
ఇలాంటి మరో సంఘటన భువనేశ్వర్లో కూడా జరిగింది. భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగిని సైబర్ నేరస్తులు లక్ష్యంగా చేసుకున్నారు. సారంగి ఫేస్బుక్ ఖాతాను మోసగాళ్లు క్లోనింగ్ చేసి, ఒక నఖిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. దీని ద్వారా వారు ప్రజల నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఈ విషయం సుధాన్షు సారంగి దృష్టికి రావడంతో, తన ఫోటో, ఖాతా వివరాలతో ఉన్న అకౌంట్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎవరు డబ్బు అడిగినా ఇవ్వకూడదని ఆయన ప్రకటించారు. ఆయన ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేదు. కానీ ఆయన ఫోటోను ఉపయోగించి ఎవరో మరో ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసి, దాని ద్వారా డబ్బు వసూలు చేస్తున్నారని సుధాన్షు సారంగి చెప్పారు. ఒడిశా పోలీసు డీఐజీ అనుప్ కుమార్ కూడా ఫేస్బుక్లో తన పేరుతో ఎవరు డబ్బు అడిగినా ఇవ్వొద్దని పోస్ట్ చేశారు. ఇలాంటి ఆన్లైన్ మోసాల గురించి ఆయన ప్రజలను హెచ్చరించారు.

ఆరు నెలల నుంచి పెరిగాయి
ఆన్లైన్లో ఇలాంటి మోసాలు వేల సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా దగ్గరి బంధువులు, స్నేహితులు మిమ్మల్ని సామాజిక మాధ్యమాల్లో డబ్బు అడినప్పుడు అది నిజమా కాదా అనేది నిర్ధారించుకోవాలి. గత ఆరు నెలల్లో ఇలాంటి మోసాలు బాగా పెరిగాయి. మొదట్లో దుండగులు ఫేస్బుక్ ఖాతాలను హ్యాక్ చేసి, వారి స్నేహుతులను డబ్బు అడిగేవారు. అన్ని సందర్భాల్లో ఇది ఫలితాలను ఇవ్వకపోవడంతో వారి ఫోటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను ఉపయోగించి ప్రజా కార్యక్రమాల పేరిట డబ్బు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వారు సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల అకౌంట్లను క్లోన్ చేస్తారు. డబ్బులు కావాలని పోస్టులు పెడతారు. ఈ విషయాలు తెలియక స్పందించినవారు మోసపోతున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఫేస్బుక్కు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో వాట్సాప్, ఓఎల్ఎక్స్ ద్వారా సైబర్ నేరస్థుల చేతిలో ప్రజలు మోసపోయినట్లు అనేక కేసులు నమోదయ్యాయి.

ఆన్లైన్ మోసాలకు గురైతే ఏంచేయాలి?

ఆన్లైన్ మోసాల బారిన పడినవారు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(www.cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్సైట్లో రెండు రకాల కంప్లైంట్లను నమోదు చేయవచ్చు. ఈ జాబితాలో మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాలు, ఆన్లైన్ నేరాలు ఉన్నాయి. పేరు, మొబైల్ నంబర్ను ఇచ్చి ఈ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేసుకోవచ్చు. మోసానికి సంబంధించిన వివరాలతో పాటు మరికొన్ని ఆధారాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

ఎలాంటి ఆధారాలు అవసరం?
మీరు ఎలా మోసపోయారో తెలియజేయడానికి సంబంధించిన అన్ని ఆధారాలను వెబ్లైట్లో అప్లోడ్ చేయాలి. నేరాలను బట్టి క్రెడిట్ కార్డు రసీదు, బ్యాంకు స్టేట్మెంట్, మోసపోవడానికి కారణమైన బ్రోచర్ లేదా పాంప్లేట్, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు,ఈమెయిల్ కాపీ, వెబ్ పేజీ URL,చాట్ ట్రాన్స్క్రిప్ట్స్, అనుమానితుల మొబైల్ నంబర్ స్క్రీన్ షాట్, వీడియోలు, ఫొటోలు, ఏదైనా ఇతర పత్రాలు అందివ్వాలి. ఫిర్యాదును నమోదు చేసిన తరువాత, కేసు సంబంధిత రాష్ట్రానికి బదిలీ అవుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. రిపోర్ట్ అండ్ ట్రాక్ ఆప్షన్ ఉన్న ఈ వెబ్సైట్లో ఈ కేసు పురోగతిని కూడా ట్రాక్ చేయవచ్చు.

ఫిర్యాదు ఉపసంహరించుకోవచ్చా?
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను ఉపసంహరించుకోలేం. ఇతర ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయనంత వరకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైతే కేసు దర్యాప్తు ప్రారంభమవుతుంది.

ఫేస్బుక్ మార్గదర్శకాల్లో ఏముంది?
ఫేస్బుక్ ద్వారా జరిగే ఆన్లైన్ మోసాలపై ఆ సంస్థ నేరుగా ఫిర్యాదు చేయదు. ఆయా మోసాలకు సంబంధించిన పోస్ట్ను మాత్రమే ఆ సంస్థ తొలగిస్తుంది. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండటానికి కొన్ని ఫేస్బుక్ కొన్ని సూచనలు ఇచ్చింది. దీని ప్రకారం ఈ మోసాలను ఐదు వర్గాలుగా విభజించింది. ఈ జాబితాలో రొమాన్స్ స్కామ్, లాటరీ మోసాలు, లోన్ స్కామ్స్, టోకెన్ దొంగతనాలు(యాక్సెస్ టోకెన్ థెఫ్ట్), ఉద్యోగాలకు సంబంధించిన మోసాలు ఉన్నాయి.

ఎలాంటి మోసాలు ఎక్కువ?
సాధారణంగా ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో జరిగే మోసాల్లో ఎక్కువ శాతం రొమాన్స్, లాటరీ, ఉద్యోగాలకు సంబంధించినవే ఉంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

1. మీకు వ్యక్తిగతంగా తెలియనివారు డబ్బు అడుగుతుంటే అనుమానించాలి. అలాంటి వారి పోస్టులు, మెస్సేజ్లకు స్పందించకూడదు.
2. మీకు ఎవరైనా డబ్బు, గిఫ్ట్ కార్డులు, లోన్లు, నగదు బహుమతులు అందిస్తామని చెప్తే మోసం జరిగేందుకు అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.
3. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తులు దరఖాస్తును తీసుకోవడానికి డబ్బు అడుగుతుంటే, వారిని అనుమానించాల్సిందే.
4. మీకు తెలిసిన వ్యక్తులు అనారోగ్యంతో ఉన్నామని, చికిత్సకు డబ్బులు కావాలని డబ్బులు అడిగితే స్పందించకూడదు. అవసరమైతే నిజంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఫోన్ చేసి నజమో కాదో తెలుసుకోవాలి.
5. ఫేస్బుక్లో మీకు కనిపించే పోస్టులు, మెస్సేజ్లకు సంబంధించిన భాష సరిగ్గా లేకపోతే అనుమానించాల్సిందే. ఇలాంటి విషయాలపై కనీస అవగాహన పెంచుకుంటే ఆన్లైన్, ఫేస్బుక్ మోసాలకు దూరంగా ఉండవచ్చు.

Author : పంకజ్ కుమార్, న్యూస్ 18
Published by:Srinivas Munigala
First published:

Tags: CYBER CRIME, Facebook, Online, Online fraud

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు