Home /News /crime /

DONOT REPLAY TO THESE FORWARD MESSAGES IN FACEBOOK THIS MAY BE ONLINE FRAUD KNOW HERE MS BK

మీ Facebook లో వ‌చ్చిన ఈ మెసేజ్ ల‌కు రిఫ్లై ఇచ్చారో మీ అకౌంట్ ఖాళీనే.. ఎలా అంటారా.. ఇలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Online Fraud: ఎప్పుడూ అడ‌గ‌ని బాస్ ఒక్క‌సారిగా అడిగేస‌రికి ఏం అవ‌స‌రం ఉందో ఏమో అనుకొని ఆ వ్యక్తి త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ. 30 వేలు పంపించేశాడు. ఆ విష‌యం బాస్ కి మెసేజ్ కూడా పెట్టాడు. వెంట‌నే బాస్ ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చిన రిఫ్లై చూసి కంగుతిన్నాడు.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  మ‌హేష్ హైద‌రాబాద్ లో ఒక ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోకుండా ఒక రోజు త‌న బాస్ Facebook Messenger నుంచి మెసేజ్ వ‌చ్చింది. ‘మ‌హేష్ నాకు అర్జెంట్ గా ఒక రూ. 30 వేలు కావాలి. ఇక్క‌డ నా phone pay నెంబ‌ర్ ఇస్తున్నాను దానికి నువ్ డబ్బులు పంపించు.’అని. ఎప్పుడూ అడ‌గ‌ని బాస్ ఒక్క‌సారిగా అడిగేస‌రికి ఏం అవ‌స‌రం ఉందో ఏమో అనుకొని మ‌హేష్ త‌న ద‌గ్గ‌ర ఉన్న రూ. 30 వేలు పంపించేశాడు. ఆ విష‌యం బాస్ కి మెసేజ్ కూడా పెట్టాడు. వెంట‌నే బాస్ ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చిన రిఫ్లై చూసి కంగుతిన్నాడు. అస‌లు నేను నిన్ను డ‌బ్బులు అడ‌గ‌డ‌మేంటీ..? అడిగితే ఫోన్ చేస్తాను క‌దా.. ఫేస్ బుక్ లో ఎందుకు మెసేజ్ చేస్తాను...? అని చెప్పేస‌రికి మ‌హేష్ కు ఒక్క‌సారిగా మైండ్ బ్లాక్ అయింది. స‌రిగ్గా ఇలాంటి మోసాలే ఇప్పుడు న‌గ‌రంలో జోరుగా సాగుతున్నాయి.

  రోజులో ప‌దుల సంఖ్య‌లో ఈ మాయ‌గాళ్ల వ‌ల‌లో ప‌డి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు అమాయకులు. ఇప్పుడు సోష‌ల్ మీడియా వాడ‌కాన్ని ఆధారం చేసుకొని అడ్డ‌దార్లో డ‌బ్బులు సంపాధింస్తున్నారు కొంద‌రు కేటుగాళ్లు. న‌గ‌రంలో గ‌డిచిన రెండు వారాల్లో న‌మోదువుతున్న కేసులు ఆధారంగా సైబ‌ర్ క్రైం పోలీసులు ఇప్పుడు ఈ ముఠాల‌పై దృష్టి పెట్టారు. మ‌న ఫేస్ బుక్ పేజ్ ను హ్య‌ాక్ చేయ‌డం ద్వారా మ‌న ప్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వ్య‌క్తుల‌కు మెసేజ్ లు పంపించి డ‌బ్బులు అడుగుతున్నారు న‌గ‌రంలో కొంద‌రు కేటుగాళ్లు. తెలిసిన వ్య‌క్తి ఎప్పుడూ డ‌బ్బులు అడ‌గ‌ని వ్య‌క్తి క‌దా అని వెనుకా ముందు ఆలోచించ‌కుండా డ‌బ్బులు పంపించి కొంత‌మంది చేతులు కాల్చుకుంటున్నారు.

  నిన్న (సోమవారం) ఒక్క రోజే న‌గ‌రంలో దాదాపు ప‌దుల సంఖ్య‌లో ఈ మోసానికి సంబంధించి సైబ‌ర్ క్రైం కి ఫిర్యాదులు వెల్లు వెత్తాయంటే ఏ స్థాయిలో వీళ్లు మోసం చేస్తోన్నారో అర్ద‌మ‌వుతుంది. ఇప్ప‌టికే Dogital Transactions ఎక్కువైన నేప‌థ్యంలో ఇటు ప్ర‌భుత్వంతోపాటు అటు కొన్ని స్వ‌చ్చంధ సంస్థ‌లు ముఖ్యంగా ఫిన్, ఓటీపీల విష‌యంలో ప్ర‌జ‌ల్లో ఒక స్థాయిలో అవ‌గాహన తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు ఓటీపీల‌తో మోసాల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది.  కానీ మోస‌గాళ్లు ఇప్పుడు కొత్త పందాల‌ను అవ‌లంబిస్తున్నారు. ఎక్కడా అనుమానాలు రాకుండా మ‌న‌కు తెలిసిన వాళ్ల ఫేస్ బుక్ నుంచే మేసెజ్ లు పంపించి డ‌బ్బులు అడుగుతున్నారు. దీంతో నిజ‌మైన వ్య‌క్తులు అనుకొని చాలా మంది వీరి వ‌ల‌లో ప‌డి మోస‌పోతున్నారు. అయితే కొంత‌మంది మాత్రం ఇలాంటి మెసేజ్ లు వ‌చ్చిన వెంట‌నే వారికే నేరుగా కాల్ చేసి విష‌యం వివ‌రించ‌డం ద్వారా ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంటున్నారు.

  ఒక బాధితుడికి ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్...


  ‘స‌రిగ్గా నాలుగు రోజుల క్రితం నా Facebook ID నుంచి నా Friend List లో ఉన్న నా క్రింది ఉద్యోగికి ఒక మెసేజ్ వెళ్లింది. అర్జెంట్ గా నాకు ఒక రూ. 20 వేలు పంపించ‌మని.. అయితే అటునుంచి అన్ని డ‌బ్బులు లేవ‌ని చెప్ప‌డంతో నీ ద‌గ్గ‌ర ఎన్ని ఉంటే అన్ని పంపించు అన్నారు. అస‌లు నా ద‌గ్గ‌ర రూ. 500 మాత్ర‌మే ఉన్న‌ాయ‌ని మ‌ళ్లీ చెప్ప‌డంతో అయితే అవే పంపించు అని అనడంతో అనుమానం వ‌చ్చిన అత‌ను నేరుగా నాకు కాల్ చేసి ఇలా మీ ఫేస్బుక్ నుంచి మెసేజ్ వ‌చ్చింది అని చెప్ప‌డంతో వెంట‌నే నేను నా పాస్వ‌ర్డ్ చేంజ్ చేయ‌డంతోపాటు సైబ‌ర్ క్రైం కి పిర్యాధు చేశా’న‌ని న్యూస్ 18 కి తెలిపారు బాధితుడు మ‌ధు.

  అయితే ఎప్పుడైనా.. మీకు తెలిసిన వాళ్లు ఎవ‌రైన డ‌బ్బులు అడిగిన‌ట్లు మెసేజ్ లు వ‌స్తే నేరుగా వారికే కాల్ చేసి అడిగి డ‌బ్బులు పంపించ‌డం చేయాల‌ని.. అంతేగాని ఇలా చేయడం ద్వారా దారుణంగా మోసపోతారని సైబ‌ర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Crime, Crime news, CYBER CRIME, Facebook, Fraud, Hyderabad, Online fraud, Phone pay, TS Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు