హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: పనిమనిషి మీద ఓనర్స్ అరాచకం.. శరీరమంతా తీవ్ర గాయాలు.. అసలేంజరిగిదంటే..

Shocking: పనిమనిషి మీద ఓనర్స్ అరాచకం.. శరీరమంతా తీవ్ర గాయాలు.. అసలేంజరిగిదంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Domestic violence: పనిమనిషి మీద ఓనర్స్ అరాచకానికి పాల్పడ్డారు. ఆమెను దారుణంగా కొట్టి తీవ్ర హింసలకు గురిచేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఢిల్లీలో ఒక కుటుంబం తమ ఇంట్లో పని మనిషి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో అభిజిత్,అతని భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో వారు.. రజని అనే పనిమనిషిని పెట్టుకున్నారు. ఆమె వెస్ట్ బెంగాల్ లోని సిల్ గురికి చెందిన మహిళ. ఆమె పొట్ట కూటికోసం వీరి ఇంటిలో పనిలో చేరింది. ఆమెకు నెలకు 7000 రూపాయలను వీరు చెల్లిస్తున్నారు.

కొంత కాలంగా అభిజిత్ దంపతులు రజనిని వేధిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం.. రజనిపై పట్ల అత్యంత దారుణంగా (Thrashed By Delhi Couple) ప్రవర్తించారు. ఆమెను తల, కళ్ళు, ముఖం, ఇత‌ర అవయవాలు, పొత్తికడుపుతో పాటు ఇతర శరీర భాగాలపై కొడుతూ తీవ్రంగా గాయాపర్చారు. ఆ తర్వాత.. ఆమెను గదిలో నిర్భందించారు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి పొవడంతో ఆమెను, ఇంటిదగ్గర వదిలేసి వెళ్లిపోయారు. రోడ్డుపై పడి ఉన్న రజనిని అక్కడి వారు గుర్తించారు. ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంది. శరీరం అంతా గాయాలుఉన్నాయి.

దీంతో ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆమె జుట్టు కత్తిరించి ఉంది. ఆమె ముఖంపై పిడిగుద్దుల కురిపించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన తర్వాత నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. అయిత, గతంలో కూడా ఈ దంపతులు ఇలాగే మరో పనిమనిషి మీత భౌతికంగా దాడిచేశారని పోలీసుల విచారణలో తెలింది.

ఇదిలా ఉండగా కేరళలో విచిత్రమైన ఘటన  వెలుగులోనికి వచ్చింది.

కేరళలో (Kerala) ఒక విచిత్రమైన దొంగతనం ఆలస్యంగా బయటపడింది. కొల్లాం జిల్లాలోని స్థానికంగా ఉన్న బ్యాంక్ లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. పత్తనాపురం పరిధిలోని జనతా జంక్షన్ లోని లోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ పఠాన పురం బ్యాంకర్స్ ను నిర్వహిస్తుంది. అయితే, ప్రతి రోజు లాగే బ్యాంక్ సిబ్బంది ఉదయాన్నే బ్యాంక్ తాళాలు తీయడానికి వచ్చారు. అయితే, అప్పటికే షట్టర్ తెరిచిఉంది. అక్కడ వస్తువులు చిందర వందరగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో చోరి జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ప్రకారం.. సదరు బ్యాంక్ మొదటి అంతస్థులో ఉంది. దొంగలు మూడో అంతస్థునుంచి మొదటి అంతస్థులోనికి ప్రవేశించారు.ఆ తర్వాత.. ప్రత్యేకమైన కట్టర్ తో అక్కడి లాకర్ తాళాలను పగలకొట్టారు. దొంగలంతా ముసుగులు ధరించి ఉన్నారు. అక్కడ ఉన్న రెండు లాకర్లను తెరిచారు. దాదాపు.. 30 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, చోరి జరిగిన ప్రదేశంచూసి పోలీసులు, బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. అక్కడ ఫోటో, నిమ్మకాయలు, తమలపాకులు, ఉండటాన్ని గమనించారు.

First published:

Tags: Brutally, Delhi, Harassment on women