హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్లాస్టిక్ కవర్లో పసికందు... కుక్కలు ఈడ్చుకెళ్లడంతో బతికింది

ప్లాస్టిక్ కవర్లో పసికందు... కుక్కలు ఈడ్చుకెళ్లడంతో బతికింది

మురికి కాలువలో పడ్డ పసికందును కుక్కలు ఈడ్చుకెళ్లాయి. కుక్కలు మొరుగుతూ.. ప్లాస్టిక్ కవర్ చుట్టూ చేరడంతో అటుగా వచ్చిన జనం అనుమానంతో చూశారు.

  అప్పుడే పుట్టిన పసికందును ప్లాస్టిక్ కవర్‌లో పడేసి మురికి కాలువలో పడేసింది ఓ కసాయి తల్లి. అయితే ఈ వీడియో అంతా అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి... మురికికాలవలో పడేసింది తల్లి. ఈ ఘటన హర్యాన రాష్ట్రంలోని కైతాల్ జిల్లాలో చోటు చేసుకుంది. డోగ్రా గేట్ ప్రాంతంలోని ఓ మురికి కాలవలో అభం శుభం తెలియని పసికందును కన్నతల్లే పడేసింది. అయితే మురికి కాలువలో పడ్డ పసికందును కుక్కలు ఈడ్చుకెళ్లాయి. కుక్కలు మొరుగుతూ.. ప్లాస్టిక్ కవర్ చుట్టూ చేరడంతో అటుగా వచ్చిన జనం అనుమానంతో చూశారు. ప్లాస్టిక్ కవర్లో ఉన్న చిన్నారిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పాపను ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.

  అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఆరోగ్యం మెరుగుపడగానే పాపను

  నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ చైల్డ్ రైట్స్‌కు (NCPCR) అప్పగిస్తామన్నారు. మరోవైపు పాప తల్లిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వెంటనే.. పాప తల్లిని గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

  కొన్నిరోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పశువులకు మేత తీసుకొచ్చేందుకు అటుగా వెళ్తున్న మహిళకు మురికికాలువలో ఓ పసికందు మృతదేహం కనిపించింది. కుక్కలు మొరగడంతో అటుగా వెళ్లిన ఆ మహిళ.. పసికందు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది. పోలీసులకు సమాచారం అందడంతో... వెంటనే శిశువు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  First published:

  Tags: Crime, Haryana

  ఉత్తమ కథలు