హోమ్ /వార్తలు /క్రైమ్ /

వీడు మనిషేనా : కుక్కని కారుకి కట్టి ఊరంతా పరుగెత్తించిన డాక్టర్..వీడియో వైరల్

వీడు మనిషేనా : కుక్కని కారుకి కట్టి ఊరంతా పరుగెత్తించిన డాక్టర్..వీడియో వైరల్

కుక్కని కారుకి కట్టి లాక్కెళ్లిన డ్రైవర్

కుక్కని కారుకి కట్టి లాక్కెళ్లిన డ్రైవర్

Dog Tied To Car : ఓ డాక్టర్ మానవత్వం మరిచి మాగజీవాన్ని దారుణంగా హించాడు. తన ఇంటి దగ్గర వీధి కుక్క ఉండటం ఇష్టం లేని ఆ డాక్టర్ వీధి కుక్కను(Stray Dog) తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు(Dog Tied To Car). ఆ కుక్క కారు వేగంతో వెనకాల పరుగెత్తలేక తీవ్రంగా ఇబ్బంది పడింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Dog Tied To Car : ఓ డాక్టర్ మానవత్వం మరిచి మాగజీవాన్ని దారుణంగా హించాడు. తన ఇంటి దగ్గర వీధి కుక్క ఉండటం ఇష్టం లేని ఆ డాక్టర్ వీధి కుక్కను(Stray Dog) తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు(Dog Tied To Car). ఆ కుక్క కారు వేగంతో వెనకాల పరుగెత్తలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. కారు వెంట పరిగెత్తలేక ఆ మూగజీవి చిత్రహింస అనుభవించిన ఈ హృదయ విదారక ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌(Jodhpur)లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆ డాక్టర్‌పై జంతుహింస చట్టం కింద కేసు నమోదుచేశారు.

అసలేం జరిగింది

రాజస్తాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ రజనీశ్‌ గల్వా ఇంటిదగ్గర వీధి కుక్కలు ఉండేవి. అయితే తన ఇంటి దగ్గర వీధి కుక్కలు ఉండటాన్ని డాక్టర్‌ రజనీశ్‌ ఇష్టపడేవాడు కాదు. ఈ క్రమంలో ఆదివారం తన ఇంటిదగ్గర ఉన్న ఓ వీధి కుక్కని గమనించిన డాక్టర్ దానిని ఊరిబయట వదిలిపెట్టాలనుకున్నాడు. దీంతో కుక్క మెడకు తాడు కట్టి తర్వాత ఆ తాడును కారుకు కట్టుకుని వేగంగా నడుపుకొంటూ వెళ్లాడు. దీంతో మరోమార్గం లేని శునకం దాని వెనక పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. కుక్క మెడకు పొడవైన తాడు కట్టడంతో అది రోడ్డుకు అటు ఇటు పరిగెత్తుతూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. కారుతో పాటు పరిగెత్తలేకపోతున్న ఆ శునకాన్ని గమనించిన ఓ బైకర్‌ కారుకు అడ్డంగా తన బైకును నిలిపి శునకాన్ని రక్షించాడు. కుక్కకి కట్టి ఉన్న తాడు విడిపించాడు. అనంతరం డాగ్‌ హోమ్‌ ఫౌండేషన్‌ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే వాళ్లు అక్కడికి చేరుకొని ఆ శునకాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Diabetes : షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..అవి తీసుకుంటే డయాబెటిస్ రివర్స్ అవుతుందట!

ఈ ఘటనపై డాగ్‌ హోమ్‌ ఫౌండేషన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ డాక్టర్‌పై జంతుహింస చట్టం కింద కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డాక్టర్ పై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, శునకం కాళ్లకు పలుచోట్ల ఫ్రాక్చర్ అయినట్టు డాగ్ హోమ్ ఫౌండేషన్ ట్విట్టర్ లో తెలిపింది. జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకాగాంధీని ట్యాగ్ చేసింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Dog, Rajastan, Viral Video

ఉత్తమ కథలు