• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DOG ATTACK ON FOUR YEARS OLD BABY GIRL WHILE SHE WAS WALKING ON ROAD ALONE IN NAGARKURNOOL VIDEO GOES VIRAL HSN

అయ్యో పాపం.. ఇంత ఘోరమా..? నాలుగేళ్ల అమ్మాయి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంటే..

అయ్యో పాపం.. ఇంత ఘోరమా..? నాలుగేళ్ల అమ్మాయి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంటే..

రోడ్డుపై వెళ్తున్న పాప (సీసీ కెమెరా ఫుటేజీ)

నందిని అనే నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది. తన మానాన తాను ఆడుకుంటూ వెళ్తోంది. ఆమె వెళ్తున్న రోడ్డు పక్కన ఓ కుక్క ఉంది. కుక్క ఆ పాపపై అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో..

  • Share this:
    నాలుగేళ్ల చిన్నారి. రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ ఆడుకుంటోంది. ప్రమాదం పొంచి ఉందని పాపం ఆ పాపకేం తెలుసు. తన మానాన తాను బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్తోంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం జరిగింది. రోడ్డు పక్కన కాపు కాచి ఉన్న ఓ కుక్క ఆ పాపపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ పాప పైకి కుక్క ఎగబడింది. ఆమెను లాక్కెళ్లాలని ప్రయత్నించింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఆ పాపను లాక్కెళ్లిపోయింది. ఒకటికి మూడు కుక్కలు తోడవడంతో ఆ పాప భయభ్రాంతులకు గురయింది. గుక్కపట్టి ఏడవసాగింది. వాటి నుంచి తనను తాను రక్షించుకోలేక సతమతమయింది. ఆ పాప ఏడుపులు విని స్థానికులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆ కుక్కలను తరిమికొట్టారు. పాపను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక బస్ డిపో ముందు ఉన్న కాలనీలో ఘోరం జరిగింది. నందిని అనే నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది. తన మానాన తాను ఆడుకుంటూ వెళ్తోంది. ఆమె వెళ్తున్న రోడ్డు పక్కన ఓ కుక్క ఉంది. ఆ పాప దాన్ని అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లసాగింది. ఇంతలోనే ఊహించని రీతిలో ఆ కుక్క నందినిపై దాడి చేసింది. పాపను నోట పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లిపోసాగింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఈడ్చుకెళ్లింది. ఆ కుక్కకు తోడు మరో మూడు కుక్కలు కూడా తోడవడంతో పాప భయాందోళనకు గురయింది.
    ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్

    కుక్కలు తనపై దాడి చేస్తోంటే ఏం చేయాలో తెలియక, వాటిని ప్రతిఘటించలేక గుక్కపట్టి ఏడవసాగింది. ఆ పాప ఏడుపులు విన్న స్థానికులు ఉరుకులు పరుగుల మీద ఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కలను తరిమి కొట్టారు. ఆ పాపను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెంటనే తరలించారు. పాప కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్టు గుర్తించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
    ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు