• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DOCTOR WHO PERFORMED THE OPERATION ON HER ALLEGEDLY LEFT A BROKEN NEEDLE INSIDE HER UTERUS WHILE STITCHING THE SURGICAL CUT SSR

ఆశా వర్కర్ చెప్పిందని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే.. కడుపులో నొప్పి మొదలైంది... ఎక్స్-రే తీసి చూస్తే..

ఆశా వర్కర్ చెప్పిందని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే.. కడుపులో నొప్పి మొదలైంది... ఎక్స్-రే తీసి చూస్తే..

బాధిత మహిళ సావిత్రి

దేవుడు పుట్టుకనిస్తే వైద్యుడు ప్రాణం పోస్తాడంటారు. అంత గొప్ప వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ డాక్టర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తే రోగి ప్రాణాల మీదకొచ్చే ప్రమాదముంది. శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించే సూదే చావును దరిచేర్చే...

  • Share this:
    కొరాపుట్: దేవుడు పుట్టుకనిస్తే వైద్యుడు ప్రాణం పోస్తాడంటారు. అంత గొప్ప వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ డాక్టర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తే రోగి ప్రాణాల మీదకొచ్చే ప్రమాదముంది. శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించే సూదే చావును దరిచేర్చే అవకాశముంది. సరిగ్గా అలాంటి ఓ నిర్లక్ష్య వైద్యుడి గురించే ఈ వార్త. ఒడిశాలోని కొరాపుట్‌లో ఓ వైద్యుడి నిర్వాకం వివాహిత ప్రాణం మీదకు తెచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు వెళితే గర్భసంచిలో విరిగిపోయిన సూది ఉన్న సంగతి మరిచి ఓ వైద్యుడు ఆపరేషన్ చేశాడు.

    ఆపరేషన్ అనంతరం.. బాధిత మహిళ పొత్తి కడుపులో నొప్పిగా ఉండటంతో వైద్యులు ఆమెకు ఎక్స్-రే చేశారు. ఎక్స్‌-రేలో ఆమె గర్భసంచిలో విరిగిపోయిన సూది ఉన్నట్లు తేలింది. ఆ సూదే నొప్పికి కారణమయిందని తెలిసింది. ఎట్టకేలకు వైద్య బృందం రెండు గంటలు కష్టపడి చికిత్స చేసి ఆమె గర్భసంచిలోని సూదిని తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కొరాపుట్ జిల్లా నందపూర్ తాలూకాలోని పరట గ్రామానికి చెందిన సావిత్రి మాఝీ ఆశా వర్కర్ సూచనతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వేసెక్టమీ) చేయించుకోవాలని నిర్ణయించుకుంది.

    మార్చి 16న ఆమె జైపూర్‌లోని జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు ఓ వైద్యుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాడు. అయితే.. ఆపరేషన్ చేసిన సందర్భంలో ఓ విరిగిపోయిన సూదిని ఆమె గర్భసంచిలోనే వదిలేసి మర్చిపోయిన సదరు వైద్యుడు అలానే ఆపరేషన్ ముగించాడు. ఆపరేషన్ తర్వాత.. గర్భసంచిలో నొప్పి రావడంతో ఆమెకు వైద్యులు ఎక్స్-రే చేశారు. ఎక్స్-రేలో సదరు వైద్యుడు నిర్వాకం బయటపడింది. ఆమె కడుపులో విరిగిన సూది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కడుపులోని విరిగిన సూదిని తీసేందుకు డాక్టర్ ప్రయత్నించినప్పటికీ వల్లకాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కొరాపుట్‌లోని ఎస్‌ఎల్‌ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్య బృందం రెండు గంటల పాటు సర్జరీ చేసి ఎట్టకేలకు ఆమె కడుపులోని సూదిని తొలగించారు.

    ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విధుల్లో అలసత్వం వహించిన వైద్యుడిపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలకు ఏం సమాధానం చెబుతాయని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సదరు మహిళ గిరిజన తెగకు చెందిన వివాహిత కావడం గమనార్హం. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని పేదలు ప్రభుత్వాసుపత్రులకు వైద్యానికి వెళితే.. ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లు ఇంకెక్కడికి వెళతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు