కీచక డాక్టర్...వైద్యం కోసం వచ్చిన మహిళకు మత్తు మందు ఇచ్చి...

ఆసుపత్రిలో స్టాఫ్ పెద్దగా ఎవరూ లేని సమయం చూసి మహిళను చికిత్స నిమిత్తంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెకు మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతేకాదు ఆమెపై అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నం చేశాడు.

news18-telugu
Updated: December 9, 2019, 10:52 PM IST
కీచక డాక్టర్...వైద్యం కోసం వచ్చిన మహిళకు మత్తు మందు ఇచ్చి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కడుపునొప్పి అని వెళ్లిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే బాధితురాలు రాజ్ ‌పురా ప్రాంతానికి చెందిన 32 సంవత్సరాల మహిళ, ఆమెకు ఇద్దరు సంతానంతో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. గత వారం కడుపు నొప్పితో బాధపడిన ఆమె స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లింది. నిందితుడు క్లినిక్ లో వైద్యుడిగా డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో స్టాఫ్ పెద్దగా ఎవరూ లేని సమయం చూసి మహిళను చికిత్స నిమిత్తంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెకు మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతేకాదు ఆమెపై  అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నం చేశాడు. దీంతో బాధిత మహిళ మత్తులో ఉన్నప్పటికీ ప్రతిఘటించింది. అనంతరం అక్కడి నుంచి మహిళ తప్పించుకొని బయటకు వచ్చి గగ్గోలు చేయగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ వైద్యుడి దేహశుద్ధి చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>