నర్సును గదిలోకి ఈడ్చుకెళ్లి...డాక్టర్ ఏం చేశాడంటే...

మహిళను ఎలాగైనా లొంగుతుందని ఆ డాక్టర్ భావించాడు. దీంతో ఆమెను ఎలాగైన లోబరచుకోవాలని పథకం పన్నాడు. ఓ రోజు రాత్రి అర్జంటు కేసు ఉందని, ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రిలోనే వేచి ఉండాలని ఆదేశించాడు. బాధిత మహిళ అర్థరాత్రి వేళ వరకూ ఆసుపత్రిలోనే ఉండిపోయింది.

news18-telugu
Updated: October 9, 2019, 10:56 PM IST
నర్సును గదిలోకి ఈడ్చుకెళ్లి...డాక్టర్ ఏం చేశాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హర్యానాకు చెందిన ఓ సీనియర్ డాక్టర్ తన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక నర్సుపై కన్నేశాడు. కొత్తగా విధుల్లో చేరిన ఆ నర్సును తన చాంబర్ లోకి ఒంటరిగా రమ్మని పలుమార్లు పిలిచేవాడు. అవసరం ఉన్నా లేకున్నా, ఆ మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు, అంతే కాదు పలుమార్లు ఆమె డ్యూటీని తన డిపార్ట్ మెంట్ లోనే పడేలా జాగ్రత్త పడేవాడు. ఇదంతా గమనించిన సదరు బాధిత మహిళ మౌనంగానే అన్నీ భరించింది. జాబ్ కొత్త కావడంతో పాటు, బాధిత మహిళ ఏమి అనలేకపోయింది. ఇదే అదనుగా భావించిన సీనియర్ డాక్టర్ మహిళను వేధించడం మొదలుపెట్టాడు.

మహిళను ఎలాగైనా లొంగుతుందని ఆ డాక్టర్ భావించాడు. దీంతో ఆమెను ఎలాగైన లోబరచుకోవాలని పథకం పన్నాడు. ఓ రోజు రాత్రి అర్జంటు కేసు ఉందని, ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రిలోనే వేచి ఉండాలని ఆదేశించాడు. బాధిత మహిళ అర్థరాత్రి వేళ వరకూ ఆసుపత్రిలోనే ఉండిపోయింది. అప్పటి వరకూ వేచి చూసిన డాక్టర్ మహిళను ఇంటికి వెళ్లమని చెప్పాడు. దీంతో మహిళ వెళుతుండగా, బాధిత మహిళ వెనుక నెమ్మదిగా వచ్చిన సీనియర్ డాక్టర్, ఆమెను అడ్డగించాడు. తన కోరిక తీర్చమని పట్టుబట్టాడు. మహిళ ప్రతిఘటించింది. నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో డాక్టర్ విచక్షణ కోల్పోయి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత మహిళ అక్కడ నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించగా, నిందితుడైన డాక్టర్ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకోగా విచారణ కొనసాగుతోంది.
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading