మరుగుతున్న నీటిలో పడిన చిన్నారి... వెంటిలేటర్ తెస్తేనే వైద్యం అన్న డాక్టర్లు... ఇంతలోనే...

డాక్టర్ జ్యోతి రౌత్‌ను పాప తల్లిదండ్రులు చికిత్స అందించాలని ప్రాధేయ పడ్డారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ డాక్టరమ్మ బాలికకు వెంటనే వెంటిలేటర్ అమర్చాలన్నారు.ఆస్పత్రిలో వెంటిలేటర్ పనిచేయడం లేదని... వెళ్లి ఓ కోటి రూపాయల వెంటిలేటర్ కొనుక్కొచ్చి ఇవ్వాలని చెప్పింది.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 11:22 AM IST
మరుగుతున్న నీటిలో పడిన చిన్నారి... వెంటిలేటర్ తెస్తేనే వైద్యం అన్న డాక్టర్లు... ఇంతలోనే...
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 11:22 AM IST
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరో పసిప్రాణాన్ని బలి తీసుకుంది. మరుగుతున్న నీడిలో పడి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి వైద్యం అందించడంలో అలసత్వం వహించారు. అంతేకాదు కోటి విలువ చేసే వెంటిలేటర్ తీసుకురావాలంటూ కండిషన్స్ పెట్టారు. ఈలోపే పాపం ఆ పసిప్రాణం .. ఈ పాడులోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో.. క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన అక్కడి ప్రభుత్వం దీనికి కారణమైన వైద్యురాల్ని సస్పెండ్ చేసింది

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 186 కిలోమీటర్ల దూరంలో ఉంది సాగర్. ఈ ప్రాంతానికి చెందిన ఏడాది పాప అన్సికా అహిర్వార్ ప్రమాదవశాత్తు మరుగుతున్న నీటిలో పడిపోయింది. దీంతో చిన్నారికి 70 శాతం గాయాలయ్యాయి. దీంతో పాపను చికిత్స నిమిత్తం బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లారు. అత్యవసర వైద్య సాయం అందించాలని వైద్యుల్ని కోరారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు... పాపను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అక్కడున్న డాక్టర్ జ్యోతి రౌత్‌ను పాప తల్లిదండ్రులు చికిత్స అందించాలని ప్రాధేయ పడ్డారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ డాక్టరమ్మ బాలికకు వెంటనే వెంటిలేటర్ అమర్చాలన్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ పనిచేయడం లేదని... వెళ్లి ఓ కోటి రూపాయల వెంటిలేటర్ కొనుక్కొచ్చి ఇవ్వాలని చెప్పింది. డాక్టర్ చెప్పిన సమాధానానికి పాపం బాధిత కుటుంబం నిర్ఘాంత పోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి పరిస్థితి మరింత విషమించడంతో బాలిక ప్రాణాలు వదిలింది.

బాధిత కుటుంబంపై వైద్యురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, బాలిక తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం డాక్టర్ రౌత్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ వీడియోను ఎడిట్ చేశారని ఆరోపించింది డాక్టర్ జ్యోతి రౌత్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు అడిషనల్ కమిషనర్ ఆధ్యర్యంలో నలుగురు వైద్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...