మరో అత్యాచారం...కడుపునొప్పి అని వెళ్లిన మహిళపై డాక్టర్ అఘాయిత్యం...

ఆ సమయంలో ఆసుపత్రిలో స్టాఫ్ పెద్దగా ఎవరూ లేని సమయం చూసి మహిళను చికిత్స నిమిత్తంగా గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నం చేశాడు.

news18-telugu
Updated: December 2, 2019, 8:01 PM IST
మరో అత్యాచారం...కడుపునొప్పి అని వెళ్లిన మహిళపై డాక్టర్ అఘాయిత్యం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కడుపునొప్పి అని వెళ్లిన యువతిపై లైంగిక దాడి చేసేందుకు పాల్పడిన ఘటన పటియాలాలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే బాధితురాలు రాజ్ ‌పురా ప్రాంతానికి చెందిన 32 సంవత్సరాల మహిళ, ఆమెకు ఇద్దరు సంతానంతో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. గత వారం కడుపు నొప్పితో బాధపడిన ఆమె స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లింది. నిందితుడు గురుప్రీత్ (పేరు మార్పుతో) క్లినిక్ లో వైద్యుడిగా డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో స్టాఫ్ పెద్దగా ఎవరూ లేని సమయం చూసి మహిళను చికిత్స నిమిత్తంగా గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నం చేశాడు. దీంతో బాధిత మహిళ పెద్ద ఎత్తున ప్రతిఘటించింది. అనంతరం అక్కడి నుంచి మహిళ తప్పించుకొని బయటకు వచ్చి గగ్గోలు చేయగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ వైద్యుడి దేహశుద్ధి చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.
First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading