అది ఇంగ్లండ్. ఓ డాక్టర్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు 100కి పైగా ఇంజెక్షన్లు ఇచ్చాడు. తద్వారా ఆమెకు పట్టిన దెయ్యం వదిలిస్తా అన్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని రకరకాల వైద్య విధానాలను ఆమెపై ప్రయోగించాడు. చివరకు ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె అదే డాక్టర్‌తో నర్సుగా పనిచేసేది. కోర్టు ఆ డాక్టర్ని నేరస్థుడిగా గుర్తించింది. శిక్ష విధించేవరకూ జైల్లోనే ఉంచాలని ఆదేశించింది. ఇంతకీ దెయ్యం వదిలించేందుకు ఆ డాక్టర్ ఆమెపై ఎలాంటి ప్రయోగాలు చేశాడు?
ఆ డాక్టర్ పేరు హోసన్ మత్వాలీ (Hosan Matwali). కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. అంతేకాదు... ఇదో భయంకరమైన కేసు అని ప్రకటించింది. "దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి ఈ డాక్టర్ ఆమెపై రకరకాల మందులను ప్రయోగించాడు. ఫలితంగా క్రమంగా ఆమె అవయవాలు పనిచేయడం మానేశాయి. చివరకు ఆమె చనిపోయింది" అని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.
డాక్టర్, నర్సు
పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా... కొన్ని వీడియోలను ఆధారాలుగా కోర్టుకు సమర్పించారు. డాక్టర్ తన ఇంట్లో ఆ నర్సుపై చేసిన ప్రయోగాల దృశ్యాలు వాటిలో ఉన్నాయి. 5 ఏళ్లపాటూ ఈ ప్రయోగాలు చేశాడు. కోర్టు మొత్తం 200 వీడియో క్లిప్పులను చూసింది. కొన్ని వీడియోల్లో ఆ డాక్టర్ ఆమెను బెడ్‌కి తాళ్లతో కట్టేశాడు. కొన్ని వీడియోల్లో ఆమెపై ఎలక్ట్రిక్ పరికరాలను ప్రయోగించినట్లు తేలింది.
2016 నాటి ఓ క్లిప్‌లో డాక్టర్ మత్వానీ... కొన్ని మంత్రాలు చదివాడు. ఆ సమయంలో... ఆమె బట్టలన్నీ విప్పేశాడు. ఆమె శరీరంపై సెంట్ లాంటివి ఏవో చల్లాడు. అప్పటికి ఆమెకు దెయ్యం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అనుకోవచ్చు (దెయ్యం ఉంది అని భావిస్తే). ఆ సమయంలో ఆమె... "ఏంటిదంతా... నన్ను రేప్ చెయ్యబోతున్నారా" అని అడిగితే... లేదన్నాడు. ఈ వీడియో చూసిన జడ్జి... ఆమెపై ఏం చల్లారని అడిగారు. తాను ఆమెకు ఎలాంటి ఇంజెక్షన్లూ ఇవ్వలేదనీ... పవిత్ర జలాలు మాత్రమే చల్లానని చెప్పాడు. అలా చల్లడం ద్వారా దెయ్యం వదిలిపోతుందని తాను భావించానని చెప్పాడు.
ఇలా రోజూ వీడియోలు చూస్తూ చూస్తూ ఉంటే... ఈ కేసు విచారణ 8 వారాలు సాగింది. చివరకు అతను ఆమెకు ఇవ్వకూడని మందులన్నీ ఇచ్చి... ఆమె ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యారని కోర్టు తేల్చింది. డాక్టర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు పెద్ద సంఖ్యలో రకరకాల మందులు కనిపించాయి. అవన్నీ ఆమెపై ప్రయోగించేందుకే స్టాక్ పెట్టాడని తెలిసింది. ఇంత చేసినా ఆ డాక్టర్... తాను ఏ తప్పూ చెయ్యలేదనీ... ఆమెకు పట్టింది మామూలు దెయ్యం కాదనీ... అందుకే ఐదేళ్లైనా దాన్ని వదిలించలేకపోయానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. కోర్టు అతనికి సెప్టెంబర్ 20 వరకూ రిమాండ్ విధించింది. ఆ తర్వాత శిక్ష విధించనుంది. ఏ శిక్ష విధిస్తుంది అన్నది ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ అయ్యింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.