• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DOCTOR FORCES WIFE TO UNDERGO ABORTION AFTER ILLEGAL SEX DETERMINATION IN UTTAR PRADESH SK

వీడు డాక్టరా? అడవి మనిషా? ఆడపిల్ల పుట్టబోతుందని తెలిసి భార్యకు టార్చర్

వీడు డాక్టరా? అడవి మనిషా? ఆడపిల్ల పుట్టబోతుందని తెలిసి భార్యకు టార్చర్

ప్రతీకాత్మక చిత్రం

పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన ఓ భర్త.. అబార్షన్ చేయించుకోవాలని తన భార్యను టార్చర్ చేశాడు. స్వయంగా డాక్టర్ అయి ఉండి.. అడవి మనిషిలా ప్రవర్తించాడు.

  • Share this:
    'అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు.' ఆడపిల్లను ఈ సమాజం ఎంతగా వెలివేసిందో ఈ సామెతను చూస్తేనే అర్ధమవుతుంది. పుట్టేది ఆడపిల్లని తెలిస్తే కడుపులోనే చంపేస్తున్నారు. పుట్టిన తర్వాత కూడా పురిట్లోనే గొంతు నులిమేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన దేశంలో నిత్యం జరుగుతున్నాయి. ఎక్కడో మారుమూల పల్లెల్లోనో.. చదువుకోని వారు మాత్రమే ఇలా చేయడం లేదు. పెద్ద నగరాల్లోనూ.. ప్రపంచం తెలిసిన విద్యావంతులు కూడా.. ఇలాంటి పనులకు తెగబడుతున్నారు. ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన ఓ భర్త.. అబార్షన్ చేయించుకోవాలని తన భార్యను టార్చర్ చేశాడు. స్వయంగా డాక్టర్ అయి ఉండి.. అడవి మనిషిలా ప్రవర్తించాడు.

    యూపీలోని నోయిడాకు చెందిన ఓ మహిళ మీరట్‌కు చెందిన డాక్టర్‌ను 2019లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. తొలిసారి పేరెంట్స్ కాబోతున్నామంటే ఎవరైనా సంతోషపడతారు. కానీ ఈ డాక్టర్ మాత్రం భార్యను టార్చర్ చేస్తున్నాడు. ఎందుకంటే.. పుట్టబోయేది ఆడపిల్ల. మన దేశంలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. కానీ ఈయన స్వయంగా డాక్టరే కదా. తనకున్న పరిచయాల ద్వారా ఓ ల్యాబ్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియడంతో.. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. అబార్షన్ చేయించుకోవాలని నరకం చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    తనను అత్తింటి వారు వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గతంలోనే ఆయనకు పెళ్లయిందని.. ఆ విషయాన్ని దాచిపెట్టి, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. అత్తామామలు కూడా గృహహింసకు పాల్పడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్వయంగా వైద్య వృత్తిలో ఉండి ఇలా ఆడపిల్ల వద్దనుకోవడం చర్చనీయాంశమయింది. అన్నీ తెలిసిన డాక్టర్లే ఇలా చేస్తే.. మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని మహిళా సంఘాలు వాపోతున్నాయి. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: