• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • DOCTOR COUPLE SHOT DEAD IN BROAD DAYLIGHT RAJASTHAN BHARATPUR SU

Doctor Couple: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల దారుణ హత్య.. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు.. ఆ ప్రతీకారంతోనే..!

(ఎడమ నుంచి కుడికి) డాక్టర్ దంపతుల హత్య సీసీటీవీ ఫుటేజ్, గతంలో హత్యకు గురైన దీప, ఆమె కొడుకు సూర్య

కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

  • Share this:
    కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నడిరోడ్డుపై పట్టపగలు.. బైక్‌పై వచ్చిన దుండగులు డాక్టర్ దంపతులను కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అనుజ్, మహేష్‌గా గుర్తించారు. వివరాలు.. డాక్టర్ సుదీప్ గుప్తా, అతని భార్య సీమా గుప్తా ఇద్దరు వైద్యులు. వీరిద్దరు కారులో ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు వారిని ఫాలో అయ్యారు. సెంట్రల్ బస్టాండ్ సమీపంలో వారి కారును అడ్డగించిన దుండగులు.. వెంటనే కారు వద్దకు చేరుకున్నారు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్నా సుదీప్ కారు గ్లాస్ దించగానే.. దుండగులు కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడిక్కడే మరణించారు.

    కాల్పుల శబ్దంతో ఆ రూట్‌లో ప్రయాణించేవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. డాక్టర్ దంపతులను హత్య చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక, డాక్టర్ దంపతుల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆర్‌బీఎం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ దంపతులపై కాల్పులకు పాల్పడ్డ.. నిందితులు అుజ్, మహేష్‌ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

    బంగ్లా యువతి గ్యాంగ్ రేప్‌ కేసులో కీలక మలుపు.. నిందితుల్లో ఇద్దరు యువతులు.. బాధిత యువతిని ట్రేస్ చేసిన పోలీసులు..

    పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. చివరకు వధువు చెల్లెలితో వరుడి పెళ్లి.. అసలేం జరిగిందంటే

    లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఎస్ఐ.. డ్యూటీలో ఉన్న సమయంలో..



    ఇక, ప్రతీకారంతోనే డాక్టర్ దంపతుల హత్య జరిగినట్టుగా సమాచారం. కొన్నేళ్ల కిందట దీపా మహిళ, ఆమె కుమారుడు సూర్య(5) ఇంటికి నిప్పంటించడం వల్ల మృతిచెందారు. ఈ కేసుకు సంబంధించి 2019 నవంబర్‌లో సుదీప్, అతని భార్య, తల్లి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. మృతిచెందిన మహిళతో సుదీప్ వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. చనిపోయిన మహిళ సోదరుడు అనుజ్.. ఇప్పుడు సుదీప్ దంపతులపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ప్రతీకారంతోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: