వైద్యురాలిని రేప్ చేసిన వైద్యుడు.. వీడియోలు వైరల్ చేస్తానని బెదిరింపులు

తోటి వైద్యురాలిని ఓ వైద్యుడు రేప్ చేశాడు. ఈ ఘటన ముంబై బైకుల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: October 24, 2020, 6:46 AM IST
వైద్యురాలిని రేప్ చేసిన వైద్యుడు.. వీడియోలు వైరల్ చేస్తానని బెదిరింపులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తోటి వైద్యురాలిని ఓ వైద్యుడు రేప్ చేశాడు. ఈ ఘటన ముంబై బైకుల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 26 ఏళ్ల గైనకాలజిస్ట్‌ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని డాక్టర్ చరణ్ పటేల్‌గా గుర్తించారు. తను సృహలో లేనప్పుడు తీసిన వీడియోలను వైరల్ చేస్తానని నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. బాధితురాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. "డిసెంబర్ 31 చరణ్, నేను, మరో ఇద్దరు డాక్టర్లు మెటర్నిటీ వార్డులో విధుల్లో ఉన్నాం. మేము నలుగురం కలిసి రెస్ట్ రూమ్‌లో పార్టీ చేసుకోవాలని అనుకున్నాం. ఈ పార్టీకి చరణ్ వైన్ తీసుకొచ్చాడు.

పార్టీ తర్వాత ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. అయితే డ్రింక్స్ తాగిన తర్వాత నాకు బాగా లేకపోవడంతో నిద్రలోకి జారుకున్నాను. వైన్‌లో చరణ్ ఎదో కలపడం వల్లే నేను సృహలో లేకుండా అయ్యాను. ఆ సమయంలో చరణ్ నన్ను సెక్సువల్‌గా వేధించాడు. ఆ మరుసటి రోజులు నా వీడియోలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో అతడు నన్ను పలుమార్లు రేప్ చేశాడు. హాస్పిటల్ రెస్ట్ రూమ్‌తోపాటు, అతని రూమ్‌లో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక, మార్చిలో కరోనా కేసులు పెరగడంతో ఆస్పత్రిని కోవిడ్ సెంటర్‌గా మార్చారు. దీంతో ఆ సమయంలో అతడు నాతో ఎలాంటి కాంటాక్టు పెట్టుకోలేదు"అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆ తర్వాత అక్టోబర్ 10న లైబ్రరీలో ఉన్న నన్ను అసభ్యకరంగా తాకడం మొదలుపెట్టాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని తన భర్తకు(అతడు కూడా ఒక డాక్టర్) చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక, తాము విచారణలో అధికారులకు సహకరిస్తామని సదరు ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్‌ను సస్పెండ్ చేశామని.. విచారణ పూర్తయ్యే వరకు అతడిని ఆస్పత్రి పరిసరాల్లోకి అనుమతించమని పేర్కొంది. కేసులో తీర్పును తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 6:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading