Home /News /crime /

DOCTOR ARRESTED FOR MOLESTING HIS COLLEGE MATE NK

బెంగళూరులో దారుణం... కాలేజీ గర్ల్‌ఫ్రెండ్‌పై డాక్టర్ అత్యాచారం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bangalore : ఆయుర్వేద ప్రాక్టీషనర్ అయిన ఆ డాక్టర్... కాలేజీలో ఆమె వాష్‌రూంకి వెళ్లినప్పుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చెయ్యడానికి వీడియో తీశాడు.

  Bangalore : పేరు దీపక్. వయసు 25 ఏళ్లు. హర్యానా... గుర్గావ్‌కి చెందిన వాడు. బెంగళూరులోని ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ఆయుర్వేద కోర్స్ చేస్తున్నాడు. అక్కడే బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఆమెను టీ, కాఫీ అంటూ అక్కడికీ ఇక్కడికీ కొన్ని రోజులు తిప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి సినిమాలకు కూడా వెళ్లారు. అతని ప్రవర్తన చూసి... అతను తనను ప్రేమిస్తున్నాడని అనుకుంది. కానీ అతను మాత్రం తాను ప్రేమిస్తున్నాననికానీ, ఇష్టం అని కానీ ఏనాడూ చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఓ రోజు... జయనగర్‌లోని ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అప్పటికే చాలాసార్లు అతనితో చాలా చోట్లకు వెళ్లడంతో... ఆ రోజు హోటల్‌కి కూడా ఎలాంటి భయమూ లేకుండా వెళ్లింది. ఆమె పేరుతో హోటల్ రూం బుక్ చేసిన అతడు... కొన్ని విషయాలపై ఆమెతో ప్రైవేట్‌గా మాట్లాడాల్సి ఉందన్నాడు. ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడతాడేమోనని అతనితో హోటల్‌కి వెళ్లింది. హోటల్ గదిలోకి వెళ్లాక... తలుపు గడియ వేశాడు. బెడ్‌పై కూర్చోమన్నాడు. చుట్టూ చూశాడు. కిటికీలు క్లోజ్ చేసి ఉన్నాయో లేదో గమనించాడు. ఆ తర్వాత ఆమెను బలవంత పెట్టి అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోమని అడిగింది. "నాకో వన్ ఇయర్ టైమ్ ఇవ్వు. నా పేరెంట్స్‌ని ఒప్పిస్తాను" అన్నాడు. ఆమెకు ఆ క్షణం ఏమనాలో అర్థం కాలేదు... ఔననీ, కాదనీ ఏమీ చెప్పలేక అయోమయంలో పడిపోయింది.

  అత్యాచార ఘటన తర్వాత అతను ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఓ రోజు... చుట్టూ ఎవరూ లేని టైమ్ చూసి... నిలదీసింది. తనను అత్యాచారం చేసి... ఎందుకు దూరం పెడుతున్నావని అడిగింది. "నీలాంటోళ్లను చాలా మందిని చూశాను. పెళ్లి చేసుకోను. ఏం చేస్తావ్" అని ఎదురుతిరిగాడు. తిక్కరేగిన ఆమె... పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అంది. "కంప్లైంట్ ఇస్తావా... అసలు పెళ్లికి ముందే నాతో వచ్చిన దానివి... ఇంకా నువ్వు ఎంత మందితో వెళ్లావో... నేనే ఎందుకు చేసుకోవాలి" అన్నాడు. షాకైన ఆమె... "నిన్న నమ్మి వస్తే... ఇంత మాటనడానికి నీకు మనసెలా వస్తోంది... నీలాంటి దుర్మార్గుడికి జైలు శిక్ష పడాల్సిందే. కచ్చితంగా వేయిస్తాను" అంది. "నీకంత సీన్ లేదు. ఎందుకంటే... నీ గుట్టు నాదగ్గరుంది" అంటూ... ఆమెకు సంబంధించిన ఓ అశ్లీల వీడియోని ఆమెకు చూపించాడు. అది ఆమె... కాలేజీలోని వాష్‌రూంకి వెళ్లినప్పటిది. తనను తాను ఆ వీడియోలో నగ్నంగా చూసి ఆశ్చర్యపోయిందామె. "ఇదెప్పుడు తీశావ్" అని రెట్టించిన కోపంతో అడిగింది. "అంతా ప్రిపేర్ అయ్యాకే... నీ జోలికొచ్చా. నాకు తెలిసి ఇక నువ్వు నా జోలికి రావనే అనుకుంటున్నా. నాకు అవసరమైనప్పుడు నిన్ను పిలుస్తా... హోటల్‌కి వద్దువుగాని" అంటూ బ్లాక్‌మెయిల్ డైలాగ్స్‌ పేల్చాడు. అతని కాలర్ పట్టుకొని... నన్ను చేసుకుంటావా లేదా అని గట్టిగా నిలదీసింది. చెంప చెళ్లుమనిపించాడు. నేలపై పడింది. "చంపేస్తా" అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచీ జారుకున్నాడు.

  "ఇలాంటి దుర్మార్గుణ్ని వదలకూడదు. నాకు ఏమైపోయినా పర్వాలేదు. వీడు మాత్రం జైల్లోనే ఉండాలి" అనుకున్న బాధితురాలు... మర్నాడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు రాశారు. హోటల్‌కి వెళ్లి చెక్ చేస్తే... రిజిస్టర్‌లో హోటల్ బుక్ చేసినట్లుగా ఆమె పేరు ఉంది. సీసీ కెమెరాల్లో చూస్తే... ఇద్దరూ హోటల్‌కి వచ్చినట్లుగా ఉంది. అంతే... పక్కా ఆధారాలు దొరకడంతో... పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

  పోలీసుల దర్యాప్తులో కొత్త విషయం తెలిసింది. అత్యాచార ఘటన తర్వాత... ఆమెను ఎలా వదిలించుకోవాలా అని ప్లాన్ వేసి... ఆ వాష్‌రూం వీడియో సీక్రెట్‌గా తీసినట్లు తెలిసింది. ఆ వీడియోని చూపిస్తే... ఇక ఆమె తన జోలికి రాదని అనుకున్నాడు. అంతేకాదు... ఆమె ఫోన్లో... ఇద్దరూ కలిసున్న ఫొటోలను కూడా ఆమెకు తెలియకుండా... డిలీట్ చేసేశాడు. ఇన్ని కన్నింగ్ డ్రామాలాడినా అతని ప్లాన్ బెడిసికొట్టడంతో... ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Bangalore, Molestation

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు