టెక్నాలజీ (Technology) పెరిగిపోవడంతో మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. కనీసం తల్లిదండ్రులను కూడా చూడని స్థితిలో ఉంటున్నారు నేటి యువత. కరోనా (Corona) కారణంగా ఏడాదిన్నరగా టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. పెద్దలు, చిన్నవాళ్లు మొబైల్స్‌తోనే కాలం గడిపేశారు. విద్యార్థులకు (Students) ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్లు ఇవ్వడంతో ఏదో ఒక పని ఉందంటూ 24 గంటలూ దగ్గరే పెట్టుకుంటున్నారు పిల్లలు. ఈ ఫోన్ల కారణంగా విద్యార్థులు సరిగా నిద్రకూడా పోవడం లేదు. సరైన సమయానికి ఆహారం (food) తీసుకోవడం లేదు. ఫలితంగా అనారోగ్యం (unhealthy) బారిన పడుతున్నారు. అయితే ఈ అలవాటే ఒక్కొక్కసారి ప్రాణాలను (Lives) తీసుకునే వరకు దారితీస్తుంది. ఎప్పుడూ దగ్గరే ఉండే ఫోన్‌ను తల్లిదండ్రులు ఇవ్వకపోవడంతో గొడవలకు దిగుతారు పిల్లలు (children). ఆ క్షణికావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని నిండు జీవితాలను బలి చేసుకుంటారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అదేంటంటే..
మొబైల్ గేమ్ గొడవ..
కరోనా కారణంగా పిల్లలు మొబైల్ గేమ్‌లకు బాగా అలవాటు పడిపోయారు. ఈ గేమ్ కారణంగా మహారాష్ట్ర (Maharashtra) లోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ గేమ్ (mobile Game) కోసం సోదరుడితో గొడవ పడిన మైనర్ బాలిక (minor girl).. మనస్తాపంతో ఎలుకల మందు (rat Medicine) తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనుపద ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె(16), కుమారుడు ఉన్నారు. అయితే, తాజాగా మైనర్ బాలిక మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుతోంది. అయితే, ఆమె తమ్ముడు కూడా మొబైల్లో గేమ్ ఆడేందుకు పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ (Fight) చోటు చేసుకుంది.
నేరుగా షాపులోకి వెళ్లి..
చివరకు ఆమె సోదరుడు ఫోన్ లాక్కొని గేమ్ ఆడాడు. ఈ ఘర్షణతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక (girl).. నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లింది. ఎలుకల మందు (Rat medicine) తీసుకువచ్చింది. సోదరుడి ముందు నిల్చుని ఫోన్ ఇవ్వకపోతే తింటానంటూ బెదిరింపులకు పాల్పడింది. అయినప్పటికీ అతను వినకపోవడంతో.. సోదరుడి ముందే బాలిక ఎలుకల మందు తినేసింది. అది చూసి షాక్ అయిన బాలిక సోదరుడు (brother) వెంటనే తల్లిదండ్రులకు (Parents) సమాచారం అందించాడు. బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తొలిరోజు బాగానే ఉన్న బాలిక.. మరుసటి రోజు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది (died). ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ మొబైల్ గేమ్‌ల కారణంగా ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఫోన్ ఇవ్వడం లేదని, గేమ్‌లో తర్వాత దశకు వెళ్లడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టామని తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్నారులు. ఇలాంటి వారిపై కుటుంబ సభ్యులు దృష్టి సారిస్తే మంచిది.
ఇది కూడా చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న 48 ఏళ్ల మహిళ.. చివరికి ఏం జరిగిందో తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime news, Died, Games, Maharashtra, Minor girl, Mobile