HOME »NEWS »CRIME »do you know what customs officers will do seized gold and other items in airports hsn

Gold: విమానాశ్రయాల్లో పట్టుబడిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు..? సమాధానం ఏంటో తెలిస్తే..

Gold: విమానాశ్రయాల్లో పట్టుబడిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు..? సమాధానం ఏంటో తెలిస్తే..
ప్రతీకాత్మక చిత్రం

దుబాయి వంటి గల్ఫ్ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువగా ఉండటమే అక్రమ రవాణాకు ఓ ముఖ్య కారణమని వేరే చెప్పనవసరం లేదు. అయితే మరి ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న్ బంగారాన్ని ఏం చేస్తారు.? ఎక్కడ దాచిపెడతారు? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా.?

  • Share this:
    దుబాయి నుంచి మూడు కిలోల బంగారాన్ని అక్రమంగా తెస్తున్న మహిళను అరెస్ట్ చేసిన శంషాబాద్ కస్టమ్స్ అధికారులు. బూట్లలో దాచి పెట్టిమరీ బంగారం స్మగ్లింగ్. బంగారాన్ని కరిగించి టూత్ పేస్టులా ఏమార్చి స్మగ్లింగ్ చేయాలని చూసిన దుండగులు.. ఇలాంటి వార్తలను తరచూ మీరు చదువుతూనే ఉంటారు. ప్రతీ రెండ్రోజుల కు ఓసారి ఏదో ఒక విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. దుబాయి వంటి గల్ఫ్ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువగా ఉండటమే ఈ అక్రమ రవాణాకు ఓ ముఖ్య కారణమని వేరే చెప్పనవసరం లేదు. అయితే మరి ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న్ బంగారాన్ని ఏం చేస్తారు.? ఎక్కడ దాచిపెడతారు? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా.?

    ఏదైనా ఇంట్లో బంగారం చోరీ జరిగితే, పోలీసులు ఆ దొంగలను పట్టుకుంటే, దొంగిలించిన సొత్తును యజమానికి అప్పగించడం జరుగుతుంది. కానీ ఈ బంగారం అక్రమ రవాణా విషయంలో అలాంటిది ఏమీ ఉండదని అందరికీ తెలుసు. అక్రమ బంగారం రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు జైలు శిక్ష విధిస్తుంటారు. మరి బంగారాన్ని ఏం చేస్తుంటారన్న డౌట్ హైదరాబాద్ లోని సామాజిక ఉద్యమకారుడైన రాబిన్ కు వచ్చింది. అంతే ఓ తనకు ఉన్న డౌట్స్ తో వరుస ప్రశ్నలతో శంషాబాద్ లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్ నగర్ లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.



    2015 నుంచి 2020 వరకు ఐదేళ్ల కాలంలో కస్టమ్స్ అధికారులు ఏఏ వస్తువులను సీజ్ చేశారు.? ఏఏ దేశాలకు చెందిన వస్తువులను సీజ్ చేశారు? ఆ కాలంలో నమోదైన కేసులు ఎన్ని? ఆ సమయంలో స్వాదీనం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేస్తారు? ఎక్కడ భద్రపరుస్తారు? ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? సీజ్ చేసిన వస్తువులను వేలం వేస్తుంటారా? ఆ వేలం గురించి ప్రజలకు ఎలా సమాచారం అందిస్తారు? ఎవరైనా కొన్నారా? కొంటే కనీసం పది మంది చిరునామా చెప్పండి? ప్రస్తుతం ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఎన్నింటిని కోర్టుకు అప్పగించారు?.. అంటూ వరుస ప్రశ్నలతో ఓ లేఖను హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్ నగర్ లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లేఖకు వారి నుంచి ఒకే ఒక్క పదంత కూడిన సమాధానం వచ్చింది. దాన్ని చూసి అతడు అవాక్కయ్యాడు. మీరు దరఖాస్తు చేసుకున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మా వద్ద సమాచారం లేదు అని వారి నుంచి ప్రత్యుత్తరం రావడంతో రాబిన్ కంగుతిన్నాడు. వారి సమాధానం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్వాధీనం చేసుకున్న వాటిని ఏం చేస్తారని అడిగితే చెప్పకపోవడం ఏంటని వాపోతున్నాడు.
    Published by:Hasaan Kandula
    First published:January 24, 2021, 07:48 IST

    टॉप स्टोरीज