Home /News /crime /

Online fraud: ఆమెకు వచ్చిన ఒక్క కాల్ లిఫ్ట్​ చేసినందుకు ఏకంగా రూ.3.38 లక్షలు పోగోట్టుకుంది.. ఏం జరిగిందంటే..

Online fraud: ఆమెకు వచ్చిన ఒక్క కాల్ లిఫ్ట్​ చేసినందుకు ఏకంగా రూ.3.38 లక్షలు పోగోట్టుకుంది.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్​లైన్​ మోసాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. మోసపోవద్దని, వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సారి ఓ కేటుగాడు ఏకంగా బ్యాంకు ఉద్యోగి (Bank employee)నే మోసం చేశాడు.

ఇంకా చదవండి ...
    ఆన్​లైన్​ మోసాలు (Online fraud) ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ప్రతీ ఒక్కరూ మొబైల్​, ల్యాప్​టాప్​లను వాడుతుండటం.. డిజిటల్​ యుగం (digital world) వేగంగా వృద్ధి చెందుతుండటంతో కేటుగాళ్లకు సైబర్​ మోసాలు చేయడం సులువైపోయింది. అయితే మామూలు వ్యక్తులు మోసపోవడం అరుదుగా జరిగే విషయంగా మారింది. మోసపోవడం.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతూనే ఉంది. ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. మోసపోవద్దని, వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సారి ఓ కేటుగాడు ఏకంగా బ్యాంకు ఉద్యోగి (Bank employee)నే మోసం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని థానేలో చోటుచేసుకుంది. ఇటీవల ఆర్బీఐ రిటైర్ట్ ఉద్యోగి (RBI Retired employee) మొబైల్ నెంబర్‌కు ఓ మెస్సెజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఫోన్‌ చేసిన సైబర్‌ నేరస్థుడు తాను.. ఎస్‌బీఐ అధికారినని.. కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ నమ్మబలికాడు. చివరకు ఆమె అకౌంట్లో ఉన్న రూ.3.38 లక్షలను కాజేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఎలా మోసపోయింది..?

    సైబర్‌ మోసానికి థానే (Thane)కు చెందిన ఆర్బీఐ రిటైర్ట్‌ ఉద్యోగి (70) మోసపోయినట్లు చితల్‌సర్‌ మాన్‌పాడ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 8న సైబర్‌ నేరస్థులు.. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను పూరించమని కోరుతూ ఒక లింక్‌ (Link)ను పంపారు. నో యువర్ కస్టమర్ (KYC) ఫారమ్‌ను అప్‌డేట్ చేయాలంటూ సందేశంలో రాశారు. అనంతరం ఆమె బ్యాంకు ఖాతా (Bank account) నుంచి రూ. 3.38 లక్షలు బదిలీ చేసుకున్నట్లు రైటైర్డ్‌ ఉద్యోగురాలు చితల్‌సర్‌ మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌లో 11న ఫిర్యాదు చేసింది. సైబర్‌ నేరస్థుడు తన నంబర్‌కు కాల్ చేసి.. ఎస్‌బీఐ అధికారి (SBI Employee) రాహుల్‌ అంటూ మాట్లాడాడు. సీనియర్ సిటిజన్‌ల కోసం కేవైసీ ఆన్‌లైన్ అప్‌గ్రేడేషన్ (KYC Online upgradation) సరికొత్త సేవను బ్యాంక్ ప్రారంభించిందని.. తాను పంపించిన లింకు ద్వారా వివరాలను పూరించాలంటూ ఆమెకు చెప్పాడు. అనంతరం నేరస్థుడు ఇచ్చిన లింక్‌పై ఆ మహిళ క్లిక్ చేసి.. అందులో ఎస్‌బీఐ లోగో (SBI Logo) ఉన్న వెబ్ పేజీని సందర్శించింది.

    ఎస్​బీఐ లోగో చూడగానే..

    అయితే.. ఎస్‌బీఐ లోగో చూడగానే.. అతను ఎస్‌బీఐ బ్యాంకు నుంచే కాల్ చేస్తున్నట్లు నమ్మానని ఆ రైటైర్డ్‌ ఉద్యోగురాలు పోలీసులకు తెలిపారు. అనంతరం తన వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు వెబ్ పేజీలో నమోదు చేశానని. నిమిషాల వ్యవధిలోనే ఆరు లావాదేవీలలో ఖాతా నుంచి రూ.3.38 లక్షలు బదిలీ అయినట్లు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన కార్డును బ్లాక్ చేయడానికి బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేశానని.. అనంతరం బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపింది. కాగా.. బాధిత వృద్ధురాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ.. 2011లో పదవీ విరమణ చేసింది. తాను ప్రస్తుం పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నానని తెలిపింది. ఇప్పుడు ఆ డబ్బును సైబర్‌ నేరగాళ్లు దోచుకోవడంతో ఆవేదన వ్యక్తం చేసింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Online fraud, Rbi, Sbi

    తదుపరి వార్తలు