హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఈ ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా.. బైక్‌కు అద్దం లేకున్నా ఫైన్ పడుద్ది..

ఈ ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా.. బైక్‌కు అద్దం లేకున్నా ఫైన్ పడుద్ది..

బైక్‌కు అద్దం లేకపోయినా ఫైన్ పడుతుంది. (Photo : https://echallan.tspolice.gov.in/publicview/)

బైక్‌కు అద్దం లేకపోయినా ఫైన్ పడుతుంది. (Photo : https://echallan.tspolice.gov.in/publicview/)

హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా.. ఫైన్ పడుతుంది. అయితే, బైక్‌కు ఇరువైపులా అద్దం లేకపోయినా ఫైన్ పడుతుందని మీకు తెలుసా?

హెల్మెట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, సిగ్నల్ జంప్ చేసినా.. ఫైన్ పడుతుంది. అయితే, బైక్‌కు ఇరువైపులా అద్దం లేకపోయినా ఫైన్ పడుతుందని మీకు తెలుసా? చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, బైక్‌కు లెఫ్ట్, రైట్ అద్దాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మిర్రర్ లేకపోతే రూ.100 ఫైన్ విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అద్దం ఉంటే రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు మరో లేన్‌కు వెళ్లే సమయంలో లేదా రోడ్డుపై టర్నింగ్‌ తీసుకునే సమయంలో వెనకాల వచ్చే వాహనాలను గుర్తించి.. ఎలాంటి గందరగోళం లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. అదే అద్దం లేకపోతే వెనకాల నుంచే వాహనాలను గుర్తించలేం. అలా చాలా చోట్ల బైక్ నడిపే వాళ్లకు, వాళ్ల వల్ల వేరే వాళ్లకు ప్రమాదం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే, బైక్‌కు మిర్రర్ లేకపోతే ఫైన్ విధిస్తూ, విధిగా రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన కేసులను మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ 117(14) కింద అభియోగాన్ని నమోదు చేస్తున్నారు.

అద్దం లేకపోవడంతో ఫైన్ వేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

First published:

Tags: Hyderabad police, Telangana News, TRAFFIC AWARENESS, Traffic rules

ఉత్తమ కథలు