వెన్నతో కిడ్నీల్లోని రాళ్లు తీస్తారట.. చిత్తూరులో నాటువైద్యులపై కేసు

మీ చదువుకోకున్నా కిడ్నీల్లో రాళ్లు తొలగిస్తామంటూ కొన్నాళ్లుగా నాటు వైద్యం చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక నుంచి కూడా రోగులు ఇక్కడకు వస్తారు. వెన్నపూస్తే రాళ్లు కరిగిపోతాయంటూ జనాల్ని నిండా మోసం చేసేవారు.

news18-telugu
Updated: February 25, 2020, 9:46 PM IST
వెన్నతో కిడ్నీల్లోని రాళ్లు తీస్తారట.. చిత్తూరులో నాటువైద్యులపై కేసు
వెన్నతో కిడ్నీల్లోని రాళ్లు తీస్తారట.. చిత్తూరులో నాటువైద్యులపై కేసు
  • Share this:
కిడ్నీల్లో రాళ్లు తొలగించడం అంత ఈజీ కాదు. అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి చికిత్స చేస్తేనే నయమవుతుంది. కానీ వీళ్లు మాత్రం మంచి నీళ్లు తాగినంత సులభంగా కిడ్నీల్లో రాళ్లు తొలగిస్తారట. జస్ట్ వెన్నపూస్తే చాలా మూత్రపిండాల్లో ఉన్న రాళ్లు ఇట్టే కరిగిపోతాయట..! ఇది నిజం కాదు. పచ్చి మోసం. అవును.. కిడ్నీల్లో రాళ్లు తొలగిస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్న నాటువైద్యులపై వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులు పెట్టాలాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. చిత్తూరులోని గంగాధర నెల్లూరు మండలం కొండేపల్లి పంచాయతీ పోలినాయుడు పల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జగన్నాథనాయుడు, విజయమ్మ దంపతులు నిరక్షరాస్యులు. ఏమీ చదువుకోకున్నా కిడ్నీల్లో రాళ్లు తొలగిస్తామంటూ కొన్నాళ్లుగా నాటు వైద్యం చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక నుంచి కూడా రోగులు ఇక్కడకు వస్తారు. వెన్నపూస్తే రాళ్లు కరిగిపోతాయంటూ జనాల్ని నిండా మోసం చేసేవారు. కొందరు వ్యక్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వీరి నాటు వైద్యం బాగోతం బయటపడింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో రమాదేవి కిడ్నీ బాధితురాలిగా నటించి నాటువైద్యుల వద్దకు వెళ్లారు. రూ.500 ఫీజు కడితే వైద్యం చేస్తామని ఆ దంపతులు చెప్పారు. తీరా.. తాను వైద్యాధికారిణని చెప్పడంతో షాక్ తిన్నారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రమాదేవి.. ఇంటి నుంచి స్నానింగ్ రిపోర్టులు, టోకెన్ స్లిప్పులు, వెన్నను స్వాధీనం చేసుకున్నారు. క

First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు