హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో చాలా మంది మధ్యతరగతి ప్రజలు తరచుగా వస్తువులు, నిత్యావసరాలు కొనుగోలు చేసే సూపర్ మార్కెట్లలో డీ-మార్ట్ ఒకటి. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది రోజూ డీ-మార్ట్‌కు వెళ్లి అవీఇవీ కొంటుంటారు. అంతటి ఆదరణ పొందిన డీ-మార్ట్ పేరునే సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు వాడుకున్నారు. డీ-మార్ట్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వినియోగదారులకు ఉచితంగా గిఫ్ట్‌లిస్తున్నట్లు కొందరికి వాట్సాప్‌లో ఫేక్ లింక్‌లు పంపారు. అది నకిలీ లింక్ అని తెలియని చాలామంది ఆ లింక్‌ను గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. కేటుగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు.
ఆ లింక్ ఓపెన్ చేయగానే.. ఓ ‘స్పిన్ వీల్’ కనిపిస్తుంది. ఆ స్పిన్‌వీల్‌ను తిప్పితే అదృష్టం మీదేనని సైబర్ నేరగాళ్లు ఆ లింక్‌లో నమ్మబలికిస్తారు. రూ.10000 వరకూ గిఫ్ట్‌కార్డు గెలుచుకునే అవకాశం ఉంటుందని స్క్రీన్‌లో కనిపిస్తుంది. అది నిజమని.. నమ్మి స్పిన్ తిప్పారా.. వారి మోసానికి బలయినట్టేనని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ స్పిన్ తిప్పగానే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆ మోసగాళ్లకు తెలిసిపోతాయి. సొమ్మును లూటీ చేస్తారు. ఆ స్పిన్ తిప్పగానే గిఫ్ట్ అంటూ మరో లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అయినట్టేనని పోలీసులు హెచ్చరించారు.
#DMart పేరుతో చక్రం తిప్పుతున్న సైబర్ నేరగాళ్ళు.
— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) February 3, 2021
#spin తిప్పితే ఖాతా ఖాళీ....
#GiftCard #fraud #Awerness #cybeercrimespscyberabad #cyberabadpolice @cyberabadpolice @cyberabadpolice @TelanganaCOPs @TelanganaDGP @hydcitypolice @RachakondaCop @SCSC_Cyberabad @CYBTRAFFIC pic.twitter.com/GzvBZDU9dW
ఇలాంటి అనధికార లింకులను ఎవరూ క్లిక్ చేయొద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా, కేవైసీ వివరాలు, డబ్బులు గెలుచుకున్నారంటూ బ్యాంకు వివరాలు తెలపమని వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. సైబర్ క్రైమ్స్ వింగ్ హైదరాబాద్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ మోసానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.