హైదరాబాద్‌లో హైఅలర్ట్... డీజేఎస్ నేతల అరెస్ట్

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీజేఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: November 9, 2019, 1:37 PM IST
హైదరాబాద్‌లో హైఅలర్ట్... డీజేఎస్ నేతల అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే తీర్పు వచ్చిన తరువాత దీనిపై మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైన డీజేఎస్(దర్స్గా జిహాద్ ఓ షహదత్) నేతలు అబ్దుల్ మాజీ, సలావుద్దీన్ అఫ్ఫన్, మహ్మద్ బిన్ ఒమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని తెలిపారు. సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. రేపు జరిగే మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉందని... దీని దృష్టిలో పెట్టుకొని అన్ని జోన్ లో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆందోళనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్ స్పష్టం చేశారు.


First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు