పెళ్లిలో డీజే చిచ్చు... ఓ రేంజ్‌లో కొట్టుకున్న బంధువులు

సూర్యాపేట జిల్లాలో డీజే కారణంగా పెళ్లిలో గొడవ జరిగింది.

news18-telugu
Updated: November 1, 2019, 1:39 PM IST
పెళ్లిలో డీజే చిచ్చు... ఓ రేంజ్‌లో కొట్టుకున్న బంధువులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లి వేడుకలో డీజే చిచ్చుపెట్టింది. డీజే వద్దన్నందుకు పెళ్లి మండపంలోనే ఎవరూ ఊహించని విధంగా గొడవ జరిగింది. సూర్యాపేట జిల్లా తొగర్రాయి గ్రామానికి చెందిన అబ్బాయికి ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి తరువాత అబ్బాయి అమ్మాయి తరపు బంధువులు ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే డీజేతో ఊరేగింపుగా వెళ్లాలని అబ్బాయి తరపు బంధువులు పట్టుబట్టారు. అయితే ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు తమకు ఆలస్యమవుతుందని... ఊరేగింపు వద్దని అమ్మాయి తరపు బంధువులు నో చెప్పారు. ఇక్కడే గొడవ మొదలైంది.

దీనిపై ఇరు పక్షాల బంధువుల మధ్య మాట మాట పెరగడంతో గొడవ జరిగింది. అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు.First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>