Home /News /crime /

DIVORCED WOMAN COMPLAINS AGAINST HER COUSIN WHO DEMANDS PHYSICAL RELATION IN AHMEDABAD SU

విడాకులు తీసుకున్న మహిళ.. సొంతవారి నుంచి షాకింగ్ అనుభవం.. అందుకోసం ఫోన్ చేసి విసిగించడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2008లో వివాహం చేసుకున్న మహిళ.. 2015లో బాబుకు జన్మనిచ్చింది. అయితే తన భర్తతో విభేదించిన కారణంగా 2019 లో  విడాకులు తీసుకుంది.

    ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. అయితే ఆమెకు సొంతవారి నుంచి షాకింగ్ అనుభవం ఎదురైంది. శారీరక సంబంధం పెట్టుకోవాలని బంధువల అబ్బాయి ఒకరు ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. అహ్మదాబాద్ నగరంలోని చంద్‌ఖేడా ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళ తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి నివసిస్తుంది. ఆమె గతంలో నవరంగ్‌పురాలోని ఓ కార్యాలయంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసింది. 2008లో రాణిప్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంతకాలం వీరి జీవితం బాగానే సాగిపోయింది. 2015లో ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. అయితే భర్తతో విభేదాల కారణంగా 2019లో విడాకులు తీసుకుంది.

    అయితే, ఆ మహిళ తన భర్తతో విభేదించిన కారణంగా 2019 లో  విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజులకే మహిళకు ఆమె అంకుల్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ఆమె బంధువే. అతడు మహిళతో.. ‘నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’అని చెప్పాడు. అయితే ఆమె మాత్రం తనకు సమయం లేదని, కలవడం కుదరదని చెప్పింది. అయితే అతడు మాత్రం ఆ మహిళకు పదేపదే ఫోన్ చేసి తనను కలవమని అడిగేవాడు.

    అయితే మహిళ మాత్రం అతడినికి కలిసేందుకు నిరాకరించింది. అసలు ఎందుకోసం కలవాలని అనుకుంటున్నావో చెప్పాలని ఫోన్‌లోనే అడిగింది. అప్పుడు అతడు..‘నువ్వు విడాకులు తీసుకున్నావు. నేను నా భార్యతో సంతోషంగా లేను. నేను నీతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది నీకు కూడా అవసరం’అని చెప్పాడు. అయితే మహిళ అతడి మాటలతో షాక్ తింది. అతడిని ఇలాంటి వాటి కోసం ఫోన్ చేయవద్దని కోరింది. కానీ ఆ వ్యక్తి తరుచుగా ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అయితే మనమంతా ఒక కుటుంబం అని.. ఇలాంటివి మాట్లాడుకోవడం తప్పు అని మహిళ వివరించింది. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. కాల్స్ చేస్తూనే ఉన్నాడు.

    మరోవైపు మహిళ ఫోన్ పోవడంతో.. అతని వేధింపులు తప్పాయి. అయితే చాలా రోజులకు ఆమె కొత్త ఫోన్ తీసుకుంది. అయితే కొద్ది రోజులకే ఆ వ్యక్తి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. వాట్సాప్‌లో కూడా మెసేజ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Ahmedabad, Gujarat, Harassment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు