DIVORCED WOMAN BEFRIENDS ON FACEBOOK AFTER RAPING BEATEN WITH BELT AND THREATENS TO MAKE VIDEO VIRAL SSR
Divorced Woman: విడాకులు తీసుకున్న మహిళ ఫేస్బుక్లో పరిచయమైన కుర్రాడిని నమ్మి హోటల్ రూంకి వెళితే.. చివరకు జరిగింది ఇది..
మహిళపైకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. పక్కనే ఉన్న భర్త.. అతడి మాటలు విని షాకైన భార్య
కాశీపూర్‌కు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆ మహిళకు ఫేస్బుక్లో ఓ యువకుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. తెలియని వ్యక్తని ఆమెకు తెలిసినప్పటికీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఆ యువకుడితో అలా మొదలైన పరిచయం మెసెంజర్లో చాటింగ్ వరకూ వెళ్లింది.
కాశీపూర్: అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అంత మంచివి కావని ఎంత అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా కొందరు మాత్రం నిలువునా మోసపోతున్నారు. స్నేహంగా మొదలయ్యే ఆ పరిచయాలు మోసంతో ముగుస్తున్నాయి. చివరికి తీరా మోసపోయిన తర్వాత లబోదిబోమనడం బాధితుల వంతైంది. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో అలా మోసపోయిన బాధితురాలు పోలీసులకు తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీపూర్‌కు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆ మహిళకు ఫేస్బుక్లో ఓ యువకుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. తెలియని వ్యక్తని ఆమెకు తెలిసినప్పటికీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఆ యువకుడితో అలా మొదలైన పరిచయం మెసెంజర్లో చాటింగ్ వరకూ వెళ్లింది. అంతటితో ఆగలేదు. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకుని వాట్సాప్‌లో సంభాషణలు, వీడియో కాల్స్ వరకూ కథ నడిచింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని యువకుడు నమ్మబలికాడు.
ఆమె కూడా ఆ యువకుడిని గుడ్డిగా నమ్మింది. అప్పటి నుంచి ఆమెను కలిసేందుకు ఆ యువకుడు పలుమార్లు కాశీపూర్ కూడా వెళ్లాడు. ఆ యువకుడి స్వస్థలం బజ్పూర్. జూన్ 15న ఆమెను నైనిటాల్‌కు తీసుకెళ్లిన ఆ యువకుడు ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఆమె వద్దంటున్నా వినకుండా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అయితే.. ఆ దృశ్యాలను ఆమెకు తెలియకుండా ఫోన్ కెమెరాను అమర్చి వీడియో తీశాడు. అప్పటి నుంచి పలుమార్లు ఆమెతో శారీరకంగా కలిశాడు. పెళ్లి చేసుకోనని ఆమెకు తేల్చి చెప్పాడు. కేవలం శృంగారం చేయాలన్న ఉద్దేశంతోనే పరిచయం పెంచుకున్నట్టు ఆమెకు చెప్పడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే వీడియోలను నెట్లో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించాడు.
జులై 7న ఏకంగా ఆ మహిళ ఉంటున్న ఇంటికే వెళ్లిన యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలేయడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి ఆ యువకుడితో దేహశుద్ధి చేశారు. పోలీసులకు వరకూ వ్యవహారం వెళ్లడంతో ఆ మహిళ జరిగిందంతా పూసగుచ్చినట్టు వాళ్లకు వివరించింది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో పరిచయాలు అంత మంచివి కావని, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.