Affair: విడాకుల కోసం వెళ్లిన మహిళతో లాయర్ వివాహేతర సంబంధం.. వ్యవహారం ఊహించని మలుపు తిరిగి..

న్యాయవాది వెంకటేశన్, సత్య

మధురవాయల్ ప్రాంతానికి చెందిన సత్య అనే 30 ఏళ్ల వయసున్న మహిళకు పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. సత్యకు, ఆమె భర్తకు మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ముగ్గురు కూతుర్లు తండ్రి వద్దే ఉంటున్నారు.

  • Share this:
    చెన్నై: వివాహేతర సంబంధాలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పవిత్రమైన వృత్తిలో ఉన్నవారు కూడా ఈ వివాహేతర సంబంధాల వ్యామోహంలో పడి బంగారం లాంటి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తమిళనాడులో వివాహేతర సంబంధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఓ న్యాయవాది ఉదంతమే ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాయల్ ప్రాంతానికి చెందిన సత్య అనే 30 ఏళ్ల వయసున్న మహిళకు పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. సత్యకు, ఆమె భర్తకు మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ముగ్గురు కూతుర్లు తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు తిరువళ్లూరుకు చెందిన వెంకటేశన్ అనే న్యాయవాదిని సత్య సంప్రదించింది. భర్త నుంచి విడాకులు కోరేందుకు వెళ్లిన సత్య పలుమార్లు వెంకటేశన్‌ను కలిసింది. అలా మొదలైన వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సత్య, వెంకటేశన్ వివాహేతర సంబంధం గురించి ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. ఇదేం పనంటూ ఆమెను మందలించారు. అయినా సత్య అవేమీ పట్టించుకోకుండా వెంకటేశన్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అంతటితో ఆగని సత్య.. మధురవాయల్‌లో తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెంకటేశన్ సహాయసహకారాలతో తిరువళ్లూరుకు చేరింది.

    వెంకటేశన్ ఆమెకు ఒక ఇల్లు అద్దెకు ఇప్పించాడు. ఆ ఇంట్లోనే వెంకటేశన్, సత్య పలుమార్లు కలిసేవారు. ఆదివారం కూడా తన ప్రియురాలు సత్యను కలుసుకునేందుకు వెంకటేశన్ ఆ ఇంటికి వెళ్లాడు. సత్య కూతుర్లు అమ్మను చూడాలంటూ మారాం చేయడంతో తిరువళ్లూరులో సత్య ఎక్కడుందో తెలుసుకున్న ఆమె కుటుంబం కూతుర్ల దగ్గరకు ఆమెను తీసుకెళ్లాలని ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో సత్యతో పాటు వెంకటేశన్ ఉండటాన్ని చూసి కోపంతో రగిలిపోయారు. సత్య తండ్రి శంకర్, తల్లి చెల్లమ్మాళ్, తమ్ముడు వినోద్, చెల్లెలు సంగీత, సంగీత భర్త వెంకటేశన్, సత్య పిన్ని దేవి.. అందరూ కలిసి సత్య, వెంకటేశన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశన్ స్పాట్‌లోనే చనిపోయాడు. సత్య కూడా గాయపడింది.

    వెంకటేశన్ మరణించడంతో భయంతో ఏం చేయాలో పాలుపోని వీళ్లంతా ఇంటికి తాళం వేసి పారిపోయారు. దాడిలో గాయపడిన సత్య అరుపులు, కేకలు విన్న ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. వెంకటేశ్ చనిపోయి, రక్తపు మడుగులో సత్య కనిపించారు. వెంకటేశన్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టంకు తరలించారు. సత్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశన్ హత్యపై న్యాయవాదులు నిరసనకు దిగారు.
    Published by:Sambasiva Reddy
    First published: