హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: వామ్మో ఇలాంటి వారు కూడా ఉన్నారా.. దానిని మనం గమనించకుంటే అనారోగ్యం పాలవుతాం.. ఏంటది..

Telangana: వామ్మో ఇలాంటి వారు కూడా ఉన్నారా.. దానిని మనం గమనించకుంటే అనారోగ్యం పాలవుతాం.. ఏంటది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ కోటి మోసాలు చేసైనా అదే పొట్ట నింపుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఇతను. అతడు చేసే మోసం చూస్తే వామ్మో అనకుండా ఉండలేరు. అసలేం చేస్తున్నాడు.

  ఎవరైనా దుకాణానికో, మార్ట్ కో వెళ్లినప్పుడు వస్తువులు తీసుకోవాలంటే దానిపై ఉన్న తయారీ తేదీ, ముగింపు తేదీని కచ్చితంగా చూస్తాం. ముగింపు తేదీ గడువు ముగియలేదంటే దానిని కొనుగోలు చేస్తాం. లేదా యజమానికి ఫిర్యాదు చేసి గడువు తేదీ ముగిసిన వస్తువును మార్చండంటూ సలహా ఇస్తాం. ఇలా  గడువు ముగిసిన చాలా వస్తువులను దుకాణ యజమానులు తిరిగి వారి వారి కంపెనీలకు పంపిస్తారు. ఇలా పంపించే క్రమంలో కొన్ని కిరాణా దుకాణాలలో.. లేదంటే సూపర్ మార్కెట్లలో డేట్ ఎక్స్‌పైర్ అయిన సరుకులు తీసుకుని.. ప్యాకెట్లపై తేదీ తుడిచేసి కొత్త డేట్ వేసి తిరిగి దుకాణాలకు అమ్మేస్తున్న ఓ హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ నిర్వాకాన్ని హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు బయటపెట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన లంగర్ హౌజ్ పోలీసులు నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు లక్ష్మీ నారాయణ గత 15 సంవత్సరాలుగా పలు హల్దీరాం ప్రొడక్టులకు డిస్ట్ర్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే దుకాణాలు, మాల్స్ లో అమ్ముడుపోని ఆ కంపెనీ ఎక్స్‌పైర్ డేట్ సరుకులు తీసుకొని.. ప్యాకెట్లపై డేట్ ఛేంజ్ చేసి తిరిగి అమ్ముతున్నాడు. అతని వద్ద దాదాపు 17 రకాల గడువు ముగింపు సరుకులు దొరికాయి. ప్యాకెట్లపై ఎక్స్ పైర్ డేట్ మార్చి తిరిగి చిన్న చిన్న దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతను చేసే పనికి పోలీసులే ఆశ్చర్యపోయారు.

  హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ కేంద్రంగా ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఇతను హల్దీరాం కు సంబంధించిన వస్తువులను తేదీ  మార్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు తేలింది. నిందితుడు నారాయణ నుంచి రూ. లక్షా 50 వేల విలువ చేసే హల్దీరాం ఎక్సపైరీ ప్రాడక్టులు, ట్రాలీ ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. గడువు తేదీ ముగిసిన వాటిని మార్కర్ తో మార్చి.. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తిరిగి చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. కరోనా ప్రభావంతో తన వ్యాపారంలో నష్టాలు రావడంతో డబ్బుల కోసం ఇలా తేదీలు మారస్తూ మార్కెట్లో అమ్ముతున్నట్లు నిందితుడు లక్ష్మినారాయణ చెబుతున్నాడు. హల్దీరామ్ కంపెనీ కి కూడా ఈ విషయం తెలియదని.. తానే సొంతంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపాడు.  మధ్య కాలం నుంచే చేస్తున్నాడా.. లేక మొదట్నుంచి ఇదేపని చేస్తున్నాడా అన్నది తేల్చేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఇతను ఒక్కడే ఉన్నాడా మరెవరికైనా దీనిలో భాగస్వామ్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

  ఎవరైనా గడువు ముగింపు తేదీలను మార్చి కిరాణా దుకాణాలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటువంటి మోసాలపై దుకాణ యజమానులు, విక్రయదారులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Expiry date, Hyderabad, Langur house, Polilce case, Selling goods and products

  ఉత్తమ కథలు