Home /News /crime /

Bangalore: అయ్యో ఎంతపని జరిగింది.. వదిన, మరదలి మధ్య గొడవ.. ఊహించని ముగింపు..!

Bangalore: అయ్యో ఎంతపని జరిగింది.. వదిన, మరదలి మధ్య గొడవ.. ఊహించని ముగింపు..!

గిరీష్ భార్య ప్రియాంక (ఫైల్ ఫొటో)

గిరీష్ భార్య ప్రియాంక (ఫైల్ ఫొటో)

గిరీష్, ప్రియాంక(35) భార్యాభర్తలు. ప్రియాంక, గిరీష్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. దురదృష్టవశాత్తూ ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చింది. అయితే.. రెండుసార్లు గర్భం నిలవకపోవడంతో అబార్షన్ అయింది. పిల్లలంటే ఎంతో ఇష్టపడే ఈ దంపతులు కొన్నేళ్లుగా ఇదే మనోవేదనతో కుమిలిపోతున్నారు. అయితే.. ఇటీవల ప్రియాంక మళ్లీ గర్భం దాల్చడంతో.. ఈసారి తమ ఆశలు నెరవేరతాయని భావించి మండ్యలోని ఆసుపత్రిలో గిరీష్ ప్రియాంకకు వైద్య పరీక్షలు చేయించాడు.

ఇంకా చదవండి ...
  బెంగళూరు: మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. బంధాలు, అనుబంధాలు అంతరించిపోతున్నాయి. చిన్నచిన్న గొడవలకే క్షణికావేశాలకు లోనవుతున్నారు. చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడుతున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. మరదలు, వదిన మధ్య జరిగిన గొడవ చిలిచిచిలికి గాలివానగా మారింది. తీవ్ర వాగ్వాదం నడుమ క్షణికావేశంలో మరదలు వదినను చంపి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని మండ్య తాలూకాలోని కంబదహళ్ళి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరీష్, ప్రియాంక(35) భార్యాభర్తలు. ప్రియాంక, గిరీష్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. దురదృష్టవశాత్తూ ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చింది. అయితే.. రెండుసార్లు గర్భం నిలవకపోవడంతో అబార్షన్ అయింది. పిల్లలంటే ఎంతో ఇష్టపడే ఈ దంపతులు కొన్నేళ్లుగా ఇదే మనోవేదనతో కుమిలిపోతున్నారు. అయితే.. ఇటీవల ప్రియాంక మళ్లీ గర్భం దాల్చడంతో.. ఈసారి తమ ఆశలు నెరవేరతాయని భావించి మండ్యలోని ఆసుపత్రిలో గిరీష్ ప్రియాంకకు వైద్య పరీక్షలు చేయించాడు. ఇదిలా ఉంటే.. గిరీష్‌కు పాతికేళ్ల వయసున్న గీతా అనే చెల్లి ఉంది. ఆమె బెంగళూరులో భర్తతో కలిసి ఉండేది. ఇటీవల కరోనా సోకి గీత భర్త చనిపోయాడు. దీంతో.. రెండు నెలల నుంచి గీత తన అన్నయ్య గిరీష్ ఇంట్లోనే ఉంటోంది. ప్రియాంకకు, గీతకు అస్సలు పడేది కాదు. ఇద్దరూ గిరీష్ ఇంట్లో లేనప్పుడల్లా ఒకరితో ఒకరు వాదులాడుకునేవారు. గీత ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రియాంక మానసిక ఒత్తిడికి లోనైంది. ఇద్దరూ పాము, ముంగిసలా గొడవపడేవారు. కొన్ని సందర్భాల్లో గిరీష్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రియాంక, గీత ఒకరినొకరు తిట్టుకునేవారు. ఇరుగుపొరుగు వాళ్లు చూస్తున్నారని, పరువు పోతుందని గిరీష్ వారించినా వినేవారు కాదు.

  ఈ క్రమంలోనే.. శనివారం రాత్రి గిరీష్ ఇంట్లో లేని సమయంలో ప్రియాంక, గీత మళ్లీ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక ఈ ఇంట్లో ఉండటం తన వల్ల కాదని, పుట్టింటికి వెళ్లిపోతానని ప్రియాంక కోపంతో తన గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుండగా కోపంతో ఊగిపోయిన గీత క్షణికావేశంలో వెనుక నుంచి వచ్చి తన వదిన అయిన ప్రియాంక తలపై బండరాయితో కొట్టింది. ఈ ఘటనతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో ప్రియాంక కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ప్రియాంక చనిపోవడంతో భయంతో ఆందోళన చెందిన గీత కూడా మరో గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

  ఇది కూడా చదవండి: Pregnant Woman: మెడికల్ షాప్‌లో పనిచేసే భర్త.. ఈమె ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ నిర్ణయం తీసుకునేది కాదేమో..

  వదిన, మరదలి మధ్య జరిగిన ఈ గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియాంక గర్భంతో ఉండటం గమనార్హం. కొద్దిసేపటికి బయటకు వెళ్లిన గిరీష్ ఇంటికొచ్చి చూసేసరికి రక్తపుమడుగులో విగత జీవిగా భార్య, ఫ్యాన్‌కు వేలాడుతూ ఉరేసుకుని చెల్లి కనిపించేసరికి ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యాడు. ఏడుస్తూ కేకలేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను మండ్య ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bengaluru, Brutally murder, Crime news, Karnataka, Mandya S10p20, Suicide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు