విజయవాడలో దారుణం... అన్న కుతూరిపై...

విజయవాడలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఓ వివాదం చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది.

news18-telugu
Updated: November 18, 2019, 6:10 AM IST
విజయవాడలో దారుణం... అన్న కుతూరిపై...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వాంబే కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం చివరకు ఆ కుటుంబంలోని చిన్నారి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు కృష్ణ, యేసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణ.. తన అన్న యేసు కూతురును భవనం రెండో అంతస్థుపై నుంచి కింద పడేశాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి జానకికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు చిన్నారిని హుటాహుటిన గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
First published: November 18, 2019, 6:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading