Srikakulam: 108 అంబులెన్స్ సిబ్బంది మధ్య వివాదం.. బాధితురాలు మృతి

Srikakulam: తాము ఉండగా కవిటి నుంచి మరో వాహనం ఎలా వస్తుందని 108 సిబ్బంది వాగ్వాదానికి దిగారు.

news18-telugu
Updated: August 5, 2020, 4:25 PM IST
Srikakulam: 108 అంబులెన్స్ సిబ్బంది మధ్య వివాదం.. బాధితురాలు మృతి
108 సిబ్బంది మధ్య గొడవతో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలు
  • Share this:
శ్రీకాకుళం జిల్లాలో 108 సిబ్బంది మధ్య వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాము ఉండగా మరో ప్రాంతం నుంచి 108 అంబులెన్స్‌ను ఎలా రప్పిస్తారని స్థానికంగా ఉండే సిబ్బంది గొడవకు దిగారు. దీంతో అంబులెన్స్ ఎక్కించకుండానే ప్రాణాలు బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ముచ్చింద్రలోని ఓ మహిళను పాటు కాటేసింది. ఆమె వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహిళ పరిస్థితి విషమించడంతో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఇచ్ఛాపురం 108ను కరోనా పేషెంట్లకు కేటాయించడంతో కవిటి నుంచి మరో అంబులెన్స్ రప్పించిన ఆస్పత్రి సిబ్బంది.. ఆమెను ఆ అంబులెన్స్ ద్వారా రిమ్స్‌కు తరలించాలని భావించారు.

అయితే తాము ఉండగా కవిటి నుంచి మరో వాహనం ఎలా వస్తుందని 108 సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మహిళను ఆస్పత్రికి తరలించేందుకు రెండు 108 అంబులెన్స్ సిబ్బంది మధ్య వివాదం చెలరేగింది. దాదాపు గంటపాటు 108 అంబులెన్స్ సిబ్బంది ఈ విషయంలో వాదనకు దిగారు. దీంతో బాధితురాలిని అంబులెన్స్ ఎక్కించకుండానే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
Published by: Kishore Akkaladevi
First published: August 5, 2020, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading