హోమ్ /వార్తలు /క్రైమ్ /

చేపల కూర.. ఇంత పని చేసిందేంటీ..? ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో తెలిస్తే..

చేపల కూర.. ఇంత పని చేసిందేంటీ..? ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో తెలిస్తే..

చేపల కూర (ప్రతీకాత్మక చిత్రం)

చేపల కూర (ప్రతీకాత్మక చిత్రం)

చేపల కూర ఏడుగురిని జైలు పాలు చేసింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును చేపల కూర వల్ల జరిగిన ఓ గొడవ వల్ల ఏడుగురు వ్యక్తులు జైలు ఊచలను లెక్కిస్తున్నారు. ఓ వ్యక్తి మరణించాడు. అసలేం జరిగిందంటే..

ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే ప్రాణాలు తీస్తుంటాయి. ఇంత చిన్న విషయానికే ప్రాణాలు తీసేశాడా.? అని అంతా ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. భార్యాభర్తల మధ్యే కాదు, ప్రాణ స్నేహితుల మధ్య కూడా సిల్లీ కారణాలు చంపుకునేదాకా పోతాయి. చివరకు కూరల విషయంలో కూడా గొడవలు జరిగి ఉసురుతీసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. చేపల కూర విషయంలో జరిగిన ఓ వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరి హత్యకు దారి తీసింది. మొత్తం ఏడుగురిని జైలు పాలు చేసింది. ఈ ఏడుగురిలో ఒక్కరే హత్యకు పాల్పడగా, మిగిలిన వారంతా ఆ హత్యను దాచిపెట్టేందుకు, ఆ శవాన్ని ఖననం చేసేందుకు సహాయపడినవారే కావడం గమనార్హం. రెండు జిల్లాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాండు రంగడు, కొంత కాలంగా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో నివసిస్తున్నాడు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న రక్షితనీటి పథకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు పాలమూరు ప్రసాద్ ను అవలింగికి తీసుకొచ్చాడు. పనులు లేవనీ, ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని ప్రసాద్ అడిగితే, తమ వద్ద పని ఇప్పిస్తానని పాండురంగడు అతడిని తీసుకెళ్లాడు. అన్నట్టుగానే పనిలో పెట్టాడు. అయితే జనవరి 21వ తారీఖు గురువారం రాత్రి పాండురంగడు, ప్రసాద్ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. చేపల కూర దగ్గర ఇద్దరికీ గొడవ వచ్చింది. మద్యం మత్తులో ఆ గొడవ కాస్తా పెద్దదిగా మారింది. మొత్తానికి కోపం పట్టలేక ప్రసాద్ తలపై పాండురంగడు బలంగా కొట్టాడు. దీంతో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. అతడు చనిపోయాడని గ్రహించిన పాండురంగడుకు మత్తు వదిలిపోయింది. ఏంచేయాలో తెలియక కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు.

వెంటనే తన కాంట్రాక్టర్ కు ఫోన్ చేశాడు. అతడి సహకారంతో గ్రామంలోని మరో ఐదుగురిని ఘటనా స్థలానికి రప్పించాడు. వారంతా కలిసి ప్రసాద్ మృతదేహాన్ని అవలింగి గ్రామ సమీపంలోని చెరువులో ఖననం చేశారు. ఈ విషయం కాకినాడలో తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అయితే గ్రామస్తులు ఈ తతంగాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో ప్రసాద్ ను పాండురంగడు చేపల కూర విషయమై జరిగిన గొడవలో చంపేశాడని తెలిసింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. అతడితోపాటు ప్రసాద్ మృతదేహాన్ని ఖననం చేసేందుకు సహాయపడిన కాంట్రాక్టర్, మరో ఐదుగురు గ్రామస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రసాద్ మృతదేహాన్ని పాతపట్నం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Chicken rate, Crime news, Fish, Murder, Murder attempt

ఉత్తమ కథలు